హోమ్ /వార్తలు /సినిమా /

నిర్భయ దోషుల ఉరిపై హీరో కార్తి సంచలన ట్వీట్..

నిర్భయ దోషుల ఉరిపై హీరో కార్తి సంచలన ట్వీట్..

నిర్భయ కేసుపై స్పందించిన కార్తి (karthi nirbhaya)

నిర్భయ కేసుపై స్పందించిన కార్తి (karthi nirbhaya)

Karthi: ఈ క్రమంలోనే హీరో కార్తి కూడా నిర్భయ దోషుల ఉరిపై ట్వీట్ చేసాడు. 8 సంవత్సరాల తర్వాత నిర్భయకు న్యాయం జరిగింది.. కానీ అలాంటి వాళ్లు ఇంకా చాలా..

8 ఏళ్ల సుధీర్ఘ పోరాటం తర్వాత నిర్భయకు న్యాయం జరిగింది. ఆమెను అతి దారుణంగా కదిలే బస్సులో నరకం చూపించిన కామాంధులకు ఇప్పుడు ఉరి పడింది. దాంతో తన కూతురుకు న్యాయం జరిగిందంటూ నిర్భయ తల్లి ఆశాదేవి కూడా న్యాయస్థానానికి కృతజ్ఞతలు తెలిపింది. అయితే దీనిపై ఇప్పుడు కొందరు సెలబ్రిటీలు కూడా మనసులో మాట చెబుతున్నారు. ఉరి పడిన క్షణం నుంచి కూడా సోషల్ మీడియాలో తమ స్పందన తెలియజేసారు. న్యాయం స్థానంపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అయితే ఇప్పుడు న్యాయం జరగడానికి ఇన్నేళ్ల సమయం పడుతుందా అంటూ కొందరు విమర్శలు కూడా చేస్తున్నారు.. కొందరు మాత్రం ఇన్నాళ్లకైనా న్యాయం జరిగిందని సంతోషిస్తున్నారు.

ఈ క్రమంలోనే హీరో కార్తి కూడా నిర్భయ దోషుల ఉరిపై ట్వీట్ చేసాడు. 8 సంవత్సరాల తర్వాత నిర్భయకు న్యాయం జరిగింది.. కానీ అలాంటి వాళ్లు ఇంకా చాలా మంది న్యాయం కోసం చూస్తున్నారు.. పొల్లాచి కేసులో న్యాయం జరగడానికి ఇంకెంత సమయం పడుతుందో అని కార్తి ప్రశ్నించాడు. ఈ ఘటన జరిగి కూడా ఇప్పటికే సంవత్సరం అయిపోయిందని గుర్తు చేసాడు ఈయన. ఈ ఘటన నుంచి మనం చాలా నేర్చుకోవలసి ఉందని కార్తి చేసిన ట్వీట్ వైరల్ అవుతుందిప్పుడు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

గతేడాది పొల్లాచ్చిలో 16 ఏళ్ల బాలిక తన చెల్లితో కలిసి షాప్‌కు వెళ్లొస్తుంటే బైక్‌పై వచ్చిన ఓ యువకుడు ఆమెను అడ్డగించి.. 16 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసిన రేప్ చేసారు. 10 మంది కామాంధులు ఆమెపై గ్యాంగ్ రేప్‌కు ఒడిగట్టారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రెండు రోజుల పాటు అమ్మాయికి నరకం చూపించిన రాక్షసులను కోయంబత్తూరు సెంట్రల్ జైలుకు తరలించారు పోలీసులు. మరి ఈ కేసులో ఈమెకు న్యాయం త్వరగా జరగాలని కార్తి కోరుకున్నాడు. మరి ఈయన కోరిక ఎన్నాళ్లకు తీరుతుందో చూడాలిక.

First published:

Tags: Karthi, Nirbhaya, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు