Karthi: రెండోసారి తండ్రి అయిన కార్తి.. సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ..

Karthi: కార్తి గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు సూర్య తమ్ముడుగా ఇక్కడికి వచ్చిన ఈయన.. కార్తి అన్న సూర్య అనే స్థాయికి ఎదిగాడు. ఓ రకంగా చెప్పాలంటే అన్న కంటే..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 20, 2020, 10:49 PM IST
Karthi: రెండోసారి తండ్రి అయిన కార్తి.. సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ..
రెండోసారి తండ్రి అయిన కార్తి (karthi ranjani)
  • Share this:
కార్తి గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు సూర్య తమ్ముడుగా ఇక్కడికి వచ్చిన ఈయన.. కార్తి అన్న సూర్య అనే స్థాయికి ఎదిగాడు. ఓ రకంగా చెప్పాలంటే అన్న కంటే ఎక్కువగా తెలుగు మార్కెట్ సొంతం చేసుకున్నాడు కార్తి. ఆయన సినిమాలు ఒకప్పుడు వరస విజయాలను కూడా అందుకున్నాయి. యుగానికి ఒక్కడు, నా పేరు శివ, ఖాకీ, ఖైదీ లాంటి సినిమాలతో తెలుగులో కార్తి ఇమేజ్ భారీగానే పెరిగిపోయింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈయన అభిమానులకు తీపికబురు చెప్పాడు. ఈయన మరోసారి తండ్రి అయ్యాడు. 2011లో రంజనీని పెళ్లి చేసుకున్నాడు కార్తి. ఈ జంటకు 2013లో అమ్మాయి పుట్టింది. ఏడేళ్ళ తర్వాత మరోసారి ఈయన తండ్రి అయ్యాడు. ఈ విషయం తెలిసిన వెంటనే సన్నిహితులు, అభిమానులు సోషల్ మీడియాలో కార్తికి కంగ్రాట్స్ చెబుతున్నారు. అక్టోబర్ 20న ఈయనకు కొడుకు పుట్టాడు. ఇదే విషయం ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకున్నాడు కార్తి. తమ కోసం కృషి చేసిన హాస్పిటల్ సిబ్బందికి మనసారా కృతజ్ఞతలు తెలిపాడు కార్తి. అలాగే దేవుడికి కూడా థ్యాంక్స్ చెప్పాడు.


అందరి ఆశీర్వాదాలు కావాలని కోరాడు ఈ హీరో. వారసుడు రావడంతో ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక కెరీర్ విషయానికొస్తే గతేడాది ఖైదీ సినిమాతో భారీ బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు కార్తి. ఈ సినిమా తెలుగులో కూడా సంచలన విజయం సాధించింది. తెలుగు, తమిళ భాషల్లో కలిపి 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది ఖైదీ. దానికి ముందు ఖాకీ సినిమా కూడా మంచి విజయమే సాధించింది. కెరీర్ పరంగా మంచి హైట్స్‌లో ఉన్నాడు ఈయన. దృశ్యం దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించిన దొంగ మాత్రం అంతగా ఆడలేదు.
రెండోసారి తండ్రి అవుతున్న కార్తి (karthi ranjani)
కార్తికి కొడుకు (karthi ranjani)

ప్రస్తుతం ఈయన 'సుల్తాన్' సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 90 శాతం పూర్తయింది. దాంతో పాటు లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో 'పొన్నియన్ సెల్వన్' సినిమాలో కూడా నటిస్తున్నాడు కార్తి. ఈ సినిమా షూటింగ్‌లో త్వరలోనే అడుగు పెట్టనున్నాడు కార్తి. అటు కెరీర్.. ఇటు వ్యక్తిగతంగా కార్తి ఇప్పుడు సంతోషంలో తేలిపోతున్నాడు.
Published by: Praveen Kumar Vadla
First published: October 20, 2020, 10:49 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading