హోమ్ /వార్తలు /సినిమా /

వెంకట్‌ సుభా మృతి.. చిక్కుల్లో నటి కస్తూరి.. !

వెంకట్‌ సుభా మృతి.. చిక్కుల్లో నటి కస్తూరి.. !

kasturi-shankar-comments-goes-viral-venkat-subha-death

kasturi-shankar-comments-goes-viral-venkat-subha-death

తమిళ నటుటు, నిర్మాత వెంకట్‌ సుభా ఇటీవల కరోనా బారిన పడి చెన్నైలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారు జామున మృతి చెందారు.

తమిళ నటుటు, నిర్మాత వెంకట్‌ సుభా ఇటీవల కరోనా బారిన పడి చెన్నైలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారు జామున మృతి చెందారు. అయితే అయన మృతికి సంతాపం తెలుపుతూ నటి కస్తూరి శంకర్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారాన్ని రేపుతుంది. ఆయన మృతిపై పరిశ్రమకు చెందిన పలువురు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. నటుడు ప్రకాశ్‌ రాజ్‌, నటి రాధిక శరత్‌ కుమార్‌లతో పాటు నటి కస్తూరి శంకర్‌ సైతం సోషల్‌ మీడియా వేదికగా ఆయనకు నివాళులు అర్పించారు.


" వెంకట్ సర్ ఇది నమ్మశక్యంగా అనిపించడం లేదు. కొద్ది రోజుల క్రితమే ఆయన ఉదయనిధి సినిమా షూటింగ్ పాల్గోని వచ్చారు. ఆ తర్వాత రోజే నుంచి ఆయనకు జ్వరం బాధపడ్డారు. కరోనా టెస్టు చేయించుకోగా ఫలితాలు నెగిటివ్‌ వచ్చాయి. కొద్ది రోజుల తర్వాత కొలుకున్నారు. ఆ తర్వాత మళ్లీ అనారోగ్యం పాలయ్యారు. తీవ్ర అనారోగ్యం కారణంగా మరణించారు.. ఆయన వ్యాక్సిన్ కూడా తీసుకోలేదు" అంటూ ఆమె సంతాపం ఆయనకు సంతాపం తెలిపారు.

ఇది కాస్త వివాదంగా మారింది. ఈ కామెంట్స్‌పై డీఏంకే కార్యకర్తలు, అభిమానులు ఆమెపై మండిపడుతున్నారు. ఇది డీఏంకే వల్ల అయిందని అనుకుంటున్నావా..! లేక వ్యాక్సిన్ వేసుకోకపోవడం వల్లే చనిపోయారు అనుకున్నావా అంటూ కస్తూరిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.

First published:

Tags: Actress Kasthuri

ఉత్తమ కథలు