సెల్ ఫోన్స్ కారణంగా మహిళలు చెడిపోతున్నారు.. ప్రముఖ దర్శకుడు సంచలన వ్యాఖ్యలు..

తమిళంలో విభిన్న కథా చిత్రాల నటుడిగా, దర్శకుడిగా తన కంటూ ఒక ఐడెంటిటీ ఏర్పరుచుకున్న భాగ్యరాజా..తాజాగా ఒక సినిమా వేడుకలో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

news18-telugu
Updated: November 27, 2019, 9:14 AM IST
సెల్ ఫోన్స్ కారణంగా మహిళలు చెడిపోతున్నారు.. ప్రముఖ దర్శకుడు సంచలన వ్యాఖ్యలు..
దర్శక నటుడు భాగ్యరాజా (News18/Tamil)
  • Share this:
తమిళంలో విభిన్న కథా చిత్రాల నటుడిగా, దర్శకుడిగా తన కంటూ ఒక ఐడెంటిటీ ఏర్పరుచుకున్న భాగ్యరాజా..తాజాగా ఒక సినిమా వేడుకలో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. తాజాగా ‘కరుత్తుగులై పుదిఉసెయ్’ సినిమా ట్రైలర్ లాంఛ్‌లో ఆయన  ఆడవాళ్ల ప్రవర్తన పై అనుచిత వ్యాఖ్యలు చేసారు. ముఖ్యంగా సెల్ ఫోన్స్ కారణంగా ఆడవాళ్లు చెడిపోతున్నారు. వివాహేతర సంబంధం కోసం భర్త, పిల్లల్ని ఒదిలేస్తున్నారన్నారని చెప్పడం పెద్ద వివాదాస్పదమైంది. అంతేకాదు మహిళల అజాగ్రత్త వల్లే రేపులు జరగుతున్నాయన్నారు. రీసెంట్‌గా పొలాచ్చిలో జరిగిన రేప్‌ ఘటనలో మగవాళ్లది అసలు తప్పే లేదన్నారు. అక్కడ అమ్మాయి అవకాశం ఇచ్చింది కాబట్టి రేప్ జరిగిందన్నారు. మరోవైపు ఇపుడున్న ఆడవాళ్లు చాలా మంది కట్టుబాట్టను ఒదిలేస్తున్నారన్నాని చెప్పారు. అలాంటి వాళ్ల వల్లే ఇన్ని అనర్థాలు వచ్చిపడ్డాయన్నారు. ఇంకోవైపు  ఆడవాళ్లు కట్టుబాట్ల గురించి మాట్లాడిన భాగ్యరాజా పురుషులు ఎన్ని సంబంధాలు పెట్టుకున్న ఏమి కాదంటూ వ్యాఖ్యానించడం కొసమెరుపు. ఈయన వ్యాఖ్యలు తమిళనాడు వ్యాప్తంగా మహిళ సంఘాలు భాగ్యరాజా తీరుపై మండిపడుతున్నాయి. వెంటనే ఆయన మహిల సమాజానికి క్షమాపణలు చెప్పాలన్నారు.

First published: November 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు