హోమ్ /వార్తలు /సినిమా /

పందెం కోడికి చుక్కెదురు, విశాల్ అరెస్ట్

పందెం కోడికి చుక్కెదురు, విశాల్ అరెస్ట్

తమిళ సినీ ఇండస్ట్రీలో కాకలు తీరిన కథానాయకులు ఎంత మంది ఉన్న అందులో తనదైన హీరోయిజంతో తమిళ నిర్మాతల సంఘం అధ్యక్ష బాధ్యతలను చేపట్టి రియల్ పందెం కోడిగా నిలిచాడు విశాల్. నిర్మాతల సంఘం అధ్యక్షకుడిగా ఇన్నాళ్లు విశాల్‌ను ఆహా ఓహో అంటూ పొగిడిన వాళ్లే..ఇపుడు ఆయనపై కారాలు మిరియాలు నూరుతున్నారు.

ఇంకా చదవండి ...

  గత కొన్నేళ్లుగా తమిళ నిర్మాతల సంఘం అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు సరిగా నిర్వహించడం లేదని ఆయనపై కొంత మంది నిర్మాతలు మండిపడుతున్నారు. వచ్చే వారం తమిళనాడులో ఏకంగా 9 సినిమాల విడుదలకు విశాల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఈ వివాదానికి అసలు కారణమంటున్నారు. ఒకేసారి ఒకే రోజు అన్ని సినిమాలు విడుదలైతే...చిన్న చిత్రాల పరిస్థితి ఏమిటని విశాల్ వ్యతిరేకంగా 50మందికి పైగా నిర్మాతలు గళమెత్తారు.

  పోలీస్ కస్టడీలో విశాల్

  ఆ సమయంలో విశాల్ అక్కడ లేకపోవడంతో..కౌన్సిల్ సెక్రటరి కదిరేశన్‌తో సదరు నిర్మాతలు వాగ్వాదానికి దిగారు. ఈ ఆందోళనలో విశాల్ కార్య‌వ‌ర్గంగా చెప్పుకునే ఉదయ, ఎస్వీ శేఖర్‌, ఏఎల్‌ అలగప్పన్‌, జేకే రితేశ్ లాంటి వాళ్లు కూడా ఈ నిర‌స‌న‌లో పాల్గొన‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఆ త‌ర్వాత వీళ్లందరు అక్క‌డే ఉన్న తాళాలు తీసుకుని కార్యాలయానికి వేసి.. వాటిని దగ్గరలో ఉన్న పోలీసు స్టేషన్‌లో ఇచ్చారు.

  ఈ రోజు ఉదయం విశాల్..నిర్మాతల సంఘం కార్యాలయ తాళాలు పగల గొట్టే ప్రయత్నం చేశారు. దీంతో సదరు ఆందోళన చేస్తోన్న నిర్మాతలు విశాల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు రంగ ప్రవేశం చేసి విశాల్‌ను అరెస్ట్ చేశారు. చూస్తుంటే విశాల్ అరెస్ట్ వివాదం తమిళ నిర్మాతల సంఘంలో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.

  ఇది కూడా చదవండి

  సుమంత్ ‘ఇదం జగత్’ ట్రైలర్ రిలీజ్: సెన్సేషనలిజమే జర్నలిజం

  మహేశ్‌ను థ్రిల్ చేస్తానంటోన్న సుకుమార్

  #NTRBiopic: రావణబ్రహ్మగా బాలకృష్ణ.. ఎన్టీఆర్ కొత్త పోస్టర్ అదరహో..

  First published:

  Tags: Kollywood, Vishal

  ఉత్తమ కథలు