మిల్కీ బ్యూటీ తమన్నా ఫ్యాన్స్ షాక్‌లో ఉన్నారు. ఇంతకీ తమన్నా ఫ్యాన్స్ ఎందుకు షాక్ ఉన్నారనుకుంటున్నారా? అందుకు కారణంగా తమన్నాకు కోర్టు నోటీసులు రావడమే. హీరోయిన్గా దశాబ్దంపైగా అనుభవాన్ని సంపాదించుకున్నప్పటికీ ఇంకా వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటూ తెలుగు, తమిళ, హిందీ సినిమాలతో బిజి బిజీగా ఉంటోంది తమన్నా. అయితే ఇన్నేళ్ల కెరీర్లో ఎప్పుడూ తమన్నా వివాదాల్లో చిక్కుకోలేదు. గాసిప్స్‌లో వినిపించే హీరోయిన్స్ లిస్టులోనూ తమన్నా పేరు కనపడదు. తను అంత ప్రొఫెషనల్‌గా ఉంటుంది మరి. అలాంటి ముద్దుగుమ్మకు కోర్టు నోటీసులు ఎందుకు వచ్చిందనే వివరాల్లోకి వెళితే.. తమన్నా సినిమాలతో పాటు పలు కమర్షియల్ ప్రొడక్ట్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గానూ వ్యవహరించారు. అలా తమ్మూ బ్యూటీ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన వాటిలో ఆన్లైన్ గేమింగ్ రమ్మీ ఒకటి ఉంది. సెలబ్రిటీలు రమ్మీని ఆడాలంటూ ప్రచారం చేయడం వల్ల యువత పాడవుతుందని కాబట్టి ఆన్లైన్ రమ్మీ గేమ్‌ను నిషేధించాలంటూ కేరళ త్రిచూర్కి చెందిన పోలీ వర్గీస్ కేరళ హైకోర్టులో పిల్ వేశాడు. కేసు పరిశీలించిన హైకోర్టు , ఆన్లైన్ రమ్మీకి అంబాసిడర్స్‌గా వ్యవహరిస్తున్న వారికి నోటీసులను జారీ చేసింది. అందులో తమన్నాతో పాటు మలయాళ నటుడు అజు వర్గీస్‌తో పాటు ఇండియన్ క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి ఉండటం గమనార్హం.
ఈ ఆన్లైన్ రమ్మీని నిషేధించాలంటూ గతంలో తమిళనాడు హైకోర్టు కూడా ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అదే తరహాలో కేరళ హైకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది. ఆన్లైన్ రమ్మీ వల్ల చాలా మంది ఆర్థికంగా నష్టపోతున్నారని, అప్పుల పాలవుతున్నప్పుడు ప్రభుత్వాలు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ కోర్టులు ప్రభుత్వాలను కోరుతున్నాయి. మరి కేరళ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.
తమన్నా బ్రాండ్ అంబాసిడర్‌గా చేసిన పనికి..సంబంధం లేకపోయినా కోర్టు నోటీసులు అందుకుందో అని ఆమె అభిమానులు అనుకుంటుంటే, మిగిలినవారు మాత్రం సెలబ్రిటీలు ఇలాంటి ఆన్లైన్ మోసాలను ఎంకరేజ్ చేసే ఆటలను ఎంకరేజ్ చేసేలా బ్రాండ్ అంబాసిడర్స్‌గా వ్యవహరించకూడదని అంటున్నారు. ప్రస్తుతం తమన్నా తెలుగులో సీటీమార్, గుర్తుందా శీతాకాలం, అందాధున్ రీమేక్, ఎఫ్ 3 చిత్రాల్లో నటిస్తుంది. బాలీవుడ్లో బోలే చూడియా సినిమాలో నటించింది.