Tamannah:తమన్నాకు భర్తగా ఉండాల్సిన అర్హత ఆ ముగ్గురు హీరోలకే ఉందట..

తమన్నా (Instagram/Photo)

Tamannah: మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా పరిచయం అయి 15 ఏళ్లు దాటిపోయింది. ఇన్నేళ్లైన మిల్కీ బ్యూటీ అందంలో ఎలాంటి మార్పు రాలేదు. తాజాగా ఆమెకు పెళ్లి చేసుకుంటే ఎలాంటి వారిని చేసుకుంటారనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానమిచ్చింది.

  • Share this:
    మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా పరిచయం అయి 15 ఏళ్లు దాటిపోయింది. ఇన్నేళ్లైన మిల్కీ బ్యూటీ అందంలో ఎలాంటి మార్పు రాలేదు. ఇన్నేళ్ల కెరీర్‌లో చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా దాదాపు అందరి హీరోలతో రొమాన్స్ చేసింది. ఇప్పటికీ తమన్నాకు వచ్చే అవకాశాలు ఆమెకు వస్తున్నాయి. ఇప్పటికే ఈ భామ 30కి చేరువైంది. ఐనా.. ఇప్పటికీ ఆమె పెళ్లి ఊసు ఎత్తడం లేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయమై ఆసక్తికర సమాధానమిచ్చింది.  తాజాగా ఆమెకు పెళ్లి చేసుకుంటే ఎలాంటి వారిని చేసుకుంటారనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానమిచ్చింది. ఒక వేళ తన పెళ్లికి స్వయంవరం ఏర్పాటు చేస్తే.. ఆ ముగ్గురు హీరోలు ఆ స్వయంవరానికి రావాలనే విషయమై కూడా ఆమె సమాధానమిచ్చింది. ఒక వేళ స్వయంవరం అంటూ ఏర్పాటు చేస్తే.. విక్కీ కౌశల్, హృతిక్ రోషన్, ప్రభాస్.. ఈ ముగ్గురును నా స్వయంవరానికి పిలుస్తాను అని చెప్పింది. మొత్తానికి తనకు కాబోయే భర్త ఎలా ఉండాలనే విషయమై తమన్నా మంచి సమాధానమే ఇచ్చింది. ఇందులో మన సౌత్ నుంచి ప్రభాస్‌‌ను సెలెక్ట్ చేయడం విశేషం. వీళ్లిద్దరు కలిసి ‘రెబల్’, ‘బాహుబలి’, ‘బాహుబలి 2’ చిత్రాల్లో కలిసి నటించిన సంగతి తెలిసిందే కదా. మొత్తానికి తమన్నా తనకు కాబోయే మొగుడు విషయంలో చాలా ఆశలే పెట్టుకున్నట్టు తెలుస్తోంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: