ప్రభాస్ లాంటి మొగుడు కావాలంటున్న టాప్ హీరోయిన్..

ప్రభాస్ (Twitter/Photo)

ప్రభాస్ లాంటి మొగుడు కావాలంటోంది ఈ టాలీవుడ్ అగ్ర కథానాయక. అంతేకాదు ఒకవేళ తాను స్వయంవరం ఏర్పాటు చేస్తే.. ప్రభాస్‌తో పాటు మరో ఇద్దరు హీరోలను ఇన్వైట్ చేస్తా అని చెబుతోంది. ఈ బ్యూటీ. వివరాల్లోకి వెళితే..

 • Share this:
  ప్రభాస్ లాంటి మొగుడు కావాలంటోంది ఈ టాలీవుడ్ అగ్ర కథానాయక. అంతేకాదు ఒకవేళ తాను స్వయంవరం ఏర్పాటు చేస్తే.. ప్రభాస్‌తో పాటు మరో ఇద్దరు హీరోలను ఇన్వైట్ చేస్తా అని చెబుతోంది. ఈ బ్యూటీ. వివరాల్లోకి వెళితే.. మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా పరిచయం అయి 15 ఏళ్లు దాటిపోయింది. ఇన్నేళ్లైన మిల్కీ బ్యూటీ అందంలో ఎలాంటి మార్పు రాలేదు. ఇన్నేళ్ల కెరీర్‌లో చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా దాదాపు అందరి హీరోలతో రొమాన్స్ చేసింది. ఇప్పటికీ తమన్నాకు వచ్చే అవకాశాలు ఆమెకు వస్తున్నాయి. ఇప్పటికే ఈ భామ 30కి చేరువైంది. ఐనా.. ఇప్పటికీ ఆమె పెళ్లి ఊసు ఎత్తడం లేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయమై ఆసక్తికర సమాధానమిచ్చింది.  తాజాగా ఆమెకు పెళ్లి చేసుకుంటే ఎలాంటి వారిని చేసుకుంటారనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానమిచ్చింది. ఒక వేళ తన పెళ్లికి స్వయంవరం ఏర్పాటు చేస్తే.. ప్రభాస్‌తో పాటు ఆ ఇద్దరు  హీరోలను  స్వయంవరానికి పిలుస్తానని చెప్పింది. ఈ స్వయంవరంలో ప్రభాస్‌తో పాటు విక్కీ కౌశల్, హృతిక్ రోషన్ తప్పకుండా ఉంటారని సమాధానమిచ్చింది.

  tamannah wants to husband like prabhas here are the details ,tamannah,tamannah marriagr,tamannah prabhas hrithik roshan vicky kaushal,tamannah prabhas marriage,tamannah hrithik roshna marriage,tamannah vicky kaushal marriage,tamannah swayamvaram,tamannah twitter,tamannah instagram,tamannah facebook,tollywood,telugu cinema,bollywood,తమన్నా,తమన్నా భాటియా,తమన్నా ప్రభాస్,తమన్నా ప్రభాస్ మ్యారేజ్,తమన్నా హృతిక్ రోషన్ మ్యారేజ్,తమన్నా విక్కీ కౌశల్ మ్యారేజ్,తమన్నా పెళ్లి
  ప్రభాస్,తమన్నా (Twitter/Photo)


  మొత్తానికి తమన్నా.. తనకు కాబోయే భర్త ఎలా ఉండాలనే విషయమై క్లారిటీతోనే ఉంది. ఇందులో ఆమె యాక్ట్ చేసిన దక్షిణాది హీరోల్లో ప్రభాస్‌‌ను సెలెక్ట్ చేయడం విశేషం. వీళ్లిద్దరు కలిసి ‘రెబల్’, ‘బాహుబలి’, ‘బాహుబలి 2’ చిత్రాల్లో కలిసి నటించిన సంగతి తెలిసిందే కదా. మొత్తానికి తమన్నా తనకు కాబోయే మొగుడు విషయంలో చాలా ఆశలే పెట్టుకున్నట్టు తెలుస్తోంది.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: