తమన్నాకు చిరంజీవి కూతురు ఏమిచ్చిందో తెలుసా..

మరోవైపు తమన్నా.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మాణంలో తెరకెక్కతోన్న ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో ముఖ్యపాత్రలో నటిస్తోంది. ఈ సినిమాలో తమన్నా కాస్టూమ్స్ ను చిరంజీవి పెద్ద కూతురు డిజైన్ చేసింది.

news18-telugu
Updated: June 11, 2019, 6:26 PM IST
తమన్నాకు చిరంజీవి కూతురు ఏమిచ్చిందో తెలుసా..
‘సైరా నరిసింహా రెడ్డి’లో ముఖ్యపాత్రలో నటిస్తోన్న తమన్నా
  • Share this:
ఈ యేడాది ‘ఎఫ్ 2’ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కింది తమన్నా. ఈ సినిమా తర్వాత ‘అభినేత్రి 2’ సినిమాతో పలకరించింది. అంతేకాదు ‘ఖామోషీ’ సినిమాతో పలకరిస్తోంది. అంతేకాదు ఈమె ముఖ్యపాత్రలో నటించిన ‘దటీజ్ మహాలక్ష్మి’ సినిమా చేసింది. ఈ సినిమా హిందీలో కంగనా హీరోయిన్‌గా నటించిన ‘క్వీన్’ సినిమాకు రీమేక్.  ఈ  సినిమాను దక్షిణాదిలో వివిధ భాషల్లో వివిధ కథానాయకలతో రీమేక్ చేసారు. త్వరలో ఈ సినిమా రిలీజ్  కానుంది. మరోవైపు తమన్నా.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మాణంలో తెరకెక్కతోన్న ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో ముఖ్యపాత్రలో నటిస్తోంది. దాదాపు షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాను అక్టోబర్ 2న దసరా సెలవుల్లో గాంధీ జయంతి రోజున విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు.  ఈ సినిమాలో చిరంజీవితో తమన్నా ధరించే దుస్తులను చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మితతో డిజైనర్ అంజు మోదీ కలిసి డిజైన్ చేసినట్టు తమన్నా ఒక ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది. ఈ  సినిమాలో తమన్నా భారీ లెహెంగాలు ధరించినట్టు చెప్పుకొచ్చింది. ‘బాహుబలి’ కన్నా ఈ సినిమాలో నేను కాస్ట్యూమ్స్ నన్ను ఎక్కువగా సర్‌ప్రైజ్ చేస్తోందన్నారు. మరోవైపు తనకు తీరని కోరికలు రెండే రెండున్నాయి. ఒకటి డాన్స్ నేపథ్యంలో తెరకెక్కే సినిమాలో నటించాలని ఉంది. మరోకటి శ్రీదేవి బయోపిక్ తెరకెక్కిస్తే.. అందులో ఆమె క్యారెక్టర్ చేయాలని ఉందని చెప్పుకొచ్చింది. అందుకే అప్పట్లో శ్రీదేవి హీరోయిన్‌గా నటించిన ‘హిమ్మత్‌వాలా’ సినిమాను రీమేక్ చేసినట్టు చెప్పుకొచ్చింది.

First published: June 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>