Tamannah: నవంబర్ నెలలో తమన్నా స్పెషల్ సర్ప్రైజ్.. మిల్కీ బ్యూటీ కొత్త అవతారానికి ఫ్యాన్స్ ఫిదా....

తమన్నా (Instagram/Photo)

Tamannah | నవంబర్ నెలలో తమన్నా తన అభిమానులకు సర్ఫ్రైజ్ ఇవ్వనుంది. దీంతో తమన్నా ఫ్యాన్స్  ఎంతో ఎగ్జైటింగ్‌గా ఎదురు చూస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. 

  • Share this:
    Tamannah | నవంబర్ నెలలో తమన్నా తన అభిమానులకు సర్ఫ్రైజ్ ఇవ్వనుంది. దీంతో తమన్నా ఫ్యాన్స్  ఎంతో ఎగ్జైటింగ్‌గా ఎదురు చూస్తున్నారు. వివరాల్లోకి వెళితే..   కొత్త టెక్నాలజీ అందుబాటులోకి రావడం.. దీనికి తోడు ఇంటర్నెట్, మొబైల్ స్ట్రీమింగ్ సేవలు కూడా అందరికి అనుకూల ధరల్లో ఉండడంతో ఇండియాలో డిజిటల్ మీడియా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. దీనికి తోడుగా పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ డిజిటల్ మీడియా కంపెనీలు భారత్ బాట పడుతున్నాయి. అందులో భాగంగా మన దేశంలో ప్రస్తుతం.. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌లు  ప్రవేశించి చాలా ప్రాచుర్యం పొందాయి. తమ మార్కెట్‌ను పెంచుకున్నాయి. ఈ సంస్థలు కేవలం హాలీవుడ్ కంటెంట్‌ను ఇండియన్ ప్రేక్షకులపై రుద్దకుండా సొంత కంటెంట్‌ను ప్రొడ్యూస్ చేస్తున్నాయి. వాటినే మనం ఒరిజనల్స్‌గా పిలుస్తున్నాము. ఈ ఒరిజనల్స్‌లో హిందీలో కియారా నుండి రాధికా ఆప్టే వరకు వెబ్ సిరీస్‌లు చేస్తూ అటూ డిజిటల్‌లో ఇటూ సినిమాల్లో మంచి అవకాశాలు పొందుతున్నారు. తెలుగులో కూడా ఇలాంటీ కల్చర్ ఇప్పుడిప్పుడే వస్తోంది.  తాజాగా  హీరోయిన్  సమంత అమెజాన్ ప్రైమ్ వెబ్‌సిరీస్‌.. ఫ్యామిలీ మ్యాన్‌ సీజన్‌లో నటిస్తోంది. మరో అగ్రతార కాజల్ అగర్వాల్ కూడా  ‘లైవ్ టెలికాస్ట్’ అనే వెబ్ సిరీస్‌ త్వరలో ప్రసారం కానుంది. తాజాగా ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన పోస్టర్‌ను కూడా రిలీజ్ చేసారు.  తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు ఈ వెబ్ సిరీస్‌ను డైరెక్ట్ చేస్తున్నాడు. మరోవైపు తమన్నా కూడా ఓ వెబ్ సిరీస్‌లో ‘నవంబర్ స్టోరీ’ అనే వెబ్ సిరీస్ చేస్తోంది. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన షూటింగ్ కంప్లీటైంది. త్వరలో డిస్నీ హాట్ స్టార్‌లో ప్రసారం కానుంది. దానికి సంబంధించిన ప్రోమో‌ను తమన్నాను విడుదల తన సోషల్ మీడియాలో విడుదల చేసింది.



    రామ సుబ్రహ్మణ్యం దర్శకత్వం వహించనున్న ఈ వెబ్‌సిరీస్‌ను ముందుగా తమిళంలో ప్రసారం కానుంది. ఆ తర్వాత వివిధ భాషల్లో కూడా ప్రసారం కానుంది. తమన్నా ఓ వైపు సినిమాలు, వెబ్ సిరీస్‌తో పాటు ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ నేతృత్వంలోని 'ఆహా' ఓటీటీ ప్లాట్ ఫాంలో.. ఓ టాక్ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తోంది తమన్నా. కాగా తమన్నాకు ఒక్కో ఎపిసోడ్‌ కు రూ. 8 లక్షల వరకు రెమ్యునిరేషన్ చెల్లిస్తున్నారట. ఇక ఈ టాక్ షోలో స్టార్ హీరోలు, హీరోయిన్స్‌. ‌ను తమన్నా ఇంటర్వ్యూ చేయనుంది.  సినిమాలతో పోల్చితే.. డిజిటల్‌లో కంటెంట్‌ను అనుకున్న విధంగా.. చెప్పడమే కాకుండా.. ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ.. దీంతో హీరోయిన్స్ మాత్రమే కాకుండా.. ఇటు డైరెక్టర్స్ కూడా డిజిటల్ బాట పడుతున్నారు. అందులో భాగంగానే తరుణ్ భాస్కర్, నందిని రెడ్డి.. మొదలగు వాళ్లు డిజిటల్ వైపు అడుగులు వేస్తున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: