మిల్కీ బ్యూటీ తమన్నా.. తొలిసారి ఆ పనిచేయబోతుంది. దీంతో ఆమె అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. తెలుగుతో పాటు హిందీ, తమిళం భాషల్లో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటి వరకు సౌత్‌లో మలయాళంలో మాత్రం ఇప్పటి వరకు నటించలేదు. కన్నడలో కూడా హీరోయిన్గా ఇప్పటి వరకు తమన్నా ఒక్క సినిమాలో కూడా హీరోయిన్గా నటించలేదు. కానీ ‘జాగ్వార్’, ‘కేజీఎఫ్’ సినిమాల్లో మాత్రం ఐటెం సాంగ్స్‌లో మాత్రం మెరిసింది. తెలుగులో దాదాపు అందరు అగ్ర హీరోల సరసన నటించిన తమన్నా.. ఇప్పుడు తొలిసారి ఓ కన్నడ చిత్రంలో హీరోయిన్గా నటించబోతుందట. అది కూడా ‘కే.జీ.ఎఫ్’ సినిమాతో ఇండియా వైడ్‌గా పాపులర్ అయిన యశ్ సినిమాలో కథానాయికగా నటించే ఛాన్స్ వచ్చిందట. ప్రస్తుతం యశ్ 'కేజీఎఫ్ 2' చేస్తున్నాడు. అక్టోబర్‌లో ఈ సినిమాను విడుదల చేయాలనే ఉద్దేశంతో వున్నారు చిత్ర యూనిట్.

తమన్నా (Twitter/Photo)
కానీ కరోనా కేసుల ఆధారంగా ఈ సినిమా రిలీజ్ ఆధారపడి ఉంది. ప్యాన్ ఇండియా సినిమా కాబట్టి మన దేశంలో పరిస్థితులన్ని నార్మల్ వచ్చాకా కానీ ఈ సినిమా విడుదల చేసే అవకాశాలు కనిపిండం లేదు. ఇక తమన్నా, యశ్ నటించే సినిమాను నార్తన్ అనే దర్శకుడు తెరకెక్కించబోతున్నాడు. ఇప్పటికే ఆ సినిమాకి సంబంధించిన కథా చర్చలు పూర్తయ్యాయని సమాచారం. కథానాయికగా తమన్నా అయితే బాగుంటుందనే ఉద్దేశంతో ఆమెతో సంప్రదింపులు జరిపారు. ఇక తమన్నా కూడా ప్రస్తుతం అంతగా అవకాశాలు లేకపోవడంతో ఈ సినిమా చేయడానికి తమన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనేది తాజా సమాచారం. కన్నడతో పాటు ఇతర భాషల్లోను ఈ సినిమాను కూడా ప్యాన్ ఇండియా లెవల్లో విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు.ఇక తమన్నా హీరోయిన్గా నటించిన ‘దటీజ్ మహాలక్ష్మి’ చిత్రం విడుదలకు రెడీగా ఉంది.
Published by:Kiran Kumar Thanjavur
First published:May 03, 2020, 15:32 IST