హోమ్ /వార్తలు /సినిమా /

Tamannah: సుమ షోలో కన్నీళ్లు పెట్టుకున్న తమన్నా.. అసలేమైంది?

Tamannah: సుమ షోలో కన్నీళ్లు పెట్టుకున్న తమన్నా.. అసలేమైంది?

తమన్నా

తమన్నా

మైండ్ బ్లాక్ పాట ప్లే చేసిన సుమ.. ఈ పాటలో తమన్నా డాన్స్ ఇరగదీసిదంటూ కామెంట్స్ చేసింది. దీంతో తమన్నా.. ఆపాట నాది కాదని..రష్మిక పాటంటూ సుమకు షాక్ ఇచ్చింది.

తమన్నా (Tamannah)టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌లలో ఒకరు. మిల్కీ బ్యూటీ వెండితెరకు పరిచయం అయ్యి దాదాపు 17 ఏళ్లు కావొస్తుంది. ఈ క్రమంలో తమన్నా మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. 2005లో హిందీలో చాంద్ సా రోషన్ చెహ్రా అనే సినిమాతో తన సినీ కెరీర్ మొదలుపెట్టింది. అదే ఏడాది శ్రీ సినిమాతో తెలుగులో, 2006లో కేడీ సినిమాతో తమిళంలో అడుగుపెట్టింది తమన్నా. హ్యాపీ డేస్(Happy days) సినిమా హిట్‌తో తమన్నా.. వరుస సినిమాల అవకాశాలు అందుకుంది. తాజాగా ఎఫ్3 సినిమాలో వెంకటేశ్ జోడిగా తమన్నా నటిస్తోంది.అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా అనిల్ రావిపూడి, సునీల్, మరో హీరోయిన్ సోనాల్ చౌహాన్‌తో కలిసి క్యాష్ షోకు వచ్చారు. అయితే ఈ క్యాష్ ప్రోమో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ప్రముఖ యాంకర్ సుమ(Anchor Suma) హోస్ట్ గా చేస్తున్న క్యాష్ ప్రోగ్రాం ప్రేక్షకులని అలరిస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈవారం ప్రసారం కాబోయే క్యాష్ ప్రోగ్రాం ఎపిసోడ్ ప్రోమోని తాజాగా విడుదల చేశారు. ఈ వారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ చాలా స్పెషల్. ఈ నెల 14న ప్రసారం కాబోయే ఎపిసోడ్ తో క్యాష్ షో(Cash) 200 వ ఎపిసోడ్ పూర్తి చేసుకోనుంది.

ఈ స్పెషల్ షోకి అంతే ప్రత్యేకమైన గెస్ట్ లని ఆహ్వానించారు. ఎఫ్3(F3) టీమ్. అనిల్ రావిపూ(Anil Ravipudi) డి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం ఎఫ్3. ఎఫ్ 2 కి ఇది సీక్వెల్ గా వస్తున్న సంగతి తెలిసిందే. వెంకీ వరుణ్ కి జోడిగా తమన్నా, మెహ్రీన్ నటిస్తున్నారు. వీరిద్దరితో పాటు హాట్ బ్యూటీ సోనాల్ చౌహన్(Sonal Chauhan)  కూడా కీలక పాత్రలో నటిస్తోంది.


ఎఫ్ 3 టీమ్ తమన్నా, అనిల్ రావిపూడి, సోనాల్ చౌహన్, సునీల్ తాజాగా క్యాష్ షోలో మెరిశారు.  తమన్నా రాగానే పాల గ్లాసుతో స్వాగతం పలికింది. మిల్క్.. బ్యూటీ అంటూ జోకులు వేసింది. ఆ తర్వాత తమన్న వాడిన వస్తువులు వేలంపాట వేస్తున్నానంటూ సుమ ఆక్షన్ మొదలు పెట్టింది. తమన్న తాగిన పాల గ్లాస్‌ను వేలం వేస్తున్నానంటూ... సుమ కామెడీ చేసింది. ఆ తర్వాత తమన్నా లిప్స్ తుడుచుకున్నటువంటి.. అంటూ టిష్యూను చూపిస్తుంది. అయితే అది చూసిన అనిల్ రావిపూడి.. ఎవండీ.. ఎందుకండీ మార్కెట్‌లో అంత మోసం చేస్తారు. ఆవిడ వేసుకున్న లిప్ స్టిక్ ఏంటి.. అక్కడ ఉన్న లిప్ స్టిక్ ఏంటి అని సుమను ప్రశ్నిస్తాడు. మొత్తం మీద ఈ షోలో సుమాను అందరూ ఫుల్‌గా ఆడేసుకున్నారు.

ఇక సోనాల్ చౌహన్ రాగానే.. ఇక్కడ వాతావరణం హాట్ గా మారిపోయింది అంటూ ఆమె హాట్ నెస్ గురించి చెప్పింది. సునీల్, అనిల్ కూడా షోలోకి ఎంటర్ అయ్యారు. ఎఫ్3 టీం తో సుమ సరదా స్కిట్ లు చేయించింది. సరిలేరు నీకెవ్వరు సినిమాలో రష్మిక పాటు.. మైండ్ బ్లాక్ పాట ప్లే చేసి... తమన్నా డాన్స్‌లో ఇరగదీస్తుదంటూ సుమ కామెంట్లు చేసింది. దీనికి తమన్నా స్పందిస్తూ.. అది నాట పాట కాదు రష్మిక పాట అంటూ.. సుమకు షాక్ ఇచ్చింది.

కొందరు అబ్బాయిలు వచ్చి తమన్నాకు రెడ్ రోజస్ ఇచ్చి ప్రపోజ్ చేశారు. అందులో ఓ కుర్రాడు ఓ రోజ్‌ను సోనాల్ చౌహాన్‌కు కూడా ఇస్తాడు. అయితే చివర్లో ఆ రోజస్ అన్నీ తీసుకెళ్లి తమన్నా సోనాల్‌కు ఇచ్చేసింది. ఇద్దరు హగ్ చేసుకుంటారు. అయితే అంతా బాగానే ఉన్నా.. క్యాష్ ప్రోమో చివర్లో మాత్రం తమన్నా చాలా ఎమోషనల్‌గా కనిపించింది. సునీల్ ఫీలింగ్స్ కూడా మారిపోయాయి. ఇంతకీ అక్కడ ఏమైంది. తమన్న ఎందుకలా ఏడ్చింది? అన్నది ఇప్పడు హాట్ టాపిక్‌గా మారింది.

First published:

Tags: F3, F3 Movie, Suma, Tamanna, Tamannaah

ఉత్తమ కథలు