Tamannaah:‘సైరా’ తర్వాత మరో పవర్ఫుల్ ప్రాజెక్ట్‌లో తమన్నా...

ప్రెజెంట్ తమన్నా చిరంజీవి సరసన నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో నటించింది. వచ్చే నెల 2న ఈ సినిమా విడుదల కానుంది. తాజగా తమన్నా మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పింది.

news18-telugu
Updated: September 25, 2019, 10:20 AM IST
Tamannaah:‘సైరా’ తర్వాత మరో పవర్ఫుల్ ప్రాజెక్ట్‌లో తమన్నా...
గోపిచంద్,సంపత్ నంది సినిమాలో తమన్నా (Twitter/Photo)
  • Share this:
ఈ యేడాది మిల్కీ బ్యూటీకి సెపరేట్‌ అని చెప్పాలి. ఈ ఇయర్ సీనియర్ హీరో వెంకటేష్‌తో కలిసి నటించిన ‘ఎఫ్2’ తో మంచి సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత ఇపుడు మెగాస్టార్ చిరంజీవి సరసన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో కనిపించనుంది. ఈ సినిమా అక్టోబర్ 2న విడుదల కానుంది. తాజాగా తమన్నా..గోపిచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో యాక్ట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అఫీషియల్‌గా ప్రకటించింది.


గతంలో తమన్నా సంపత్ నంది డైరెక్ట్ చేసిన ‘రచ్చ’, ‘బెంగాల్ టైగర్’ సినిమాల్లో మెరిసిన సంగతి తెలిసిందే కదా. ఇపుడు ముచ్చటగా మూడోసారి సంపత్ నంది దర్శకత్వంలో యాక్ట్ చేయబోతుంది.

గోపీచంద్ సరసన తమన్నా (twitter/Photo)


ఇక గోపిచంద్ సరసన మాత్రం మొదటిసారి కథానాయికగా నటిస్తోంది. హీరోగా గోపీచంద్‌కు ఇంది 28వ సినిమా. థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కే ఈ సినిమా త్వరలో పట్టాలెక్కనుంది.
Published by: Kiran Kumar Thanjavur
First published: September 25, 2019, 10:16 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading