TAMANNAAH SHARES HER FEELING AFTER TWO MONTHS OF CORONA VIRUS TIME NR
Tamannaah Bhatia: కరోనా తర్వాత రెండు నెలల పాటు అలా అంటూ గుట్టు విప్పిన తమన్నా!
Tamannaah Bhatia
Tamannaah Bhatia: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా పరిచయం గురించి టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకుల అందరికీ తెలిసిందే. ఈ బ్యూటీ ఎన్నో సినిమాలలో నటించిన తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకుంది.
Tamannaah Bhatia: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా పరిచయం గురించి టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకుల అందరికీ తెలిసిందే. ఈ బ్యూటీ ఎన్నో సినిమాలలో నటించిన తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకుంది. అతి తక్కువ సమయంలో స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని అందుకుంది. ఇదిలా ఉంటే తమన్నా కొన్ని వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంది.
దేశంలో ప్రస్తుతం కరోనా తీవ్రత ప్రభావం ఎలా ఉందో అందరికీ తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ విషయం గురించి కొన్ని విషయాలు పంచుకుంది తమన్నా. అంతేకాకుండా తనకు కూడా కోవిడ్ పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల నుండి సంభవిస్తున్న ఈ వైరస్ ఘటనలను వింటుంటే ఎంతో బాధగా ఉందని, ఫస్ట్ వేవ్ సమయంలో కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని తెలిపింది.ప్రస్తుతం సెకండ్ వేవ్ కూడా మరింత ప్రాణాంతకంగా ఉండటంతో పాటు అందర్నీ భయపెట్టిస్తుందని తెలిపింది. వేల సంఖ్యలో నమోదవుతున్న మరణాల సంఖ్యలు తనను తీవ్రంగా కలచివేస్తున్నాయని.. గత ఏడాది తన తల్లిదండ్రులు కూడా కరోనా బారిన పడ్డారని తెలిపింది. ఇక ఆ తర్వాత నెలలో తనకు కూడా పాజిటివ్ వచ్చిందని పంచుకుంది. ప్రస్తుతం గతంలో ఉన్నట్టు లేదంటూ ఇంట్లో ఉన్న అందరికీ విభిన్న లక్షణాలతో వస్తుందని దయచేసి జాగ్రత్తగా ఉండండి అంటూ కోరింది.
ఇక ప్రస్తుతం డిజిటల్ కంటెంట్ గురించి కూడా కొన్ని విషయాలు పంచుకుంది. థియేటర్స్ తెరుచుకునే వరకు డిజిటల్ కంటెంట్ ను ఫాలో అయ్యే పరిస్థితి అని.. సినిమా, వెబ్ సిరీస్ లు డిఫరెంట్ జూనియర్స్ అని తెలిపింది. థియేటర్స్ లో మాత్రం ఉండే ఎక్స్పీరియన్స్ పెద్ద స్థాయి అంటూ.. కానీ ప్రస్తుతం డిజిటల్ విడుదల తప్పదని తెలిపింది. ఇక తాను నటించిన నవంబర్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ కు మంచి స్పందన వచ్చిందని తెలిపింది. అందులో తను అనురాధ గణేషన్ పాత్రలో పోషించాననంటూ ఇక ఆ సిరీస్ గురించి కొన్ని విషయాలు పంచుకుంది. ఇక ప్రస్తుతం తను సిటీ మార్ సినిమా లో నటిస్తున్నానని తెలిపింది. ఇక ఈ సినిమాలో తను తెలంగాణ కబడ్డీ కోచ్ జ్వాల రెడ్డి పాత్రలో నటిస్తున్నానని తెలిపింది.
ఇక ఈ సినిమాలో తెలంగాణ భాష తో డబ్బింగ్ చెప్పానని తెలిపింది. ఇక తను కరోనా నుంచి కోలుకున్న తర్వాత తిరిగి నార్మల్ కావడానికి రెండు నెలల సమయం పట్టిందని, అవి క్లిష్టతరమైన పరిస్థితులని తెలిపింది. ఇక ఆ సమయంలో వ్యాయామాలు చేయడం చాలా కష్టమని తెలిపింది. ఇక కొన్ని సందర్భాల్లో చాలా నీరసంగా ఉండేది అంటూ, అలా ఉన్నప్పుడు కష్టంగా అనిపించేది అని తెలిపింది. ఇక తను కరోనా సోకిన తర్వాత తల శరీరం పనిచేసే తీరులో బాగా అర్థం చేసుకొని అలా నడుచుకోవడం వల్లే త్వరగా కోలుకున్నానని తెలిపింది. ఇక తను మాస్ట్రో సినిమాల్లో నటిస్తున్నానని తెలిపింది. ఇక ఈ సినిమాలో వయసు, సినిమా కథ పట్ల తన పాత్రను మార్పును ఉన్నాయని తెలిపింది. ఇక ప్రస్తుతం తెలుగులో ఎఫ్3, గుర్తుందా శీతాకాలం సినిమాల్లో బిజీగా ఉన్నానని తెలిపింది.
Published by:Navya Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.