ముద్దులకు దూరం.. మిల్కీ బ్యూటీ తమన్నా

 Tamannaah Bhatia : తమన్నా నటిస్తోన్న 'యాక్షన్' సినిమా విడుదలకు సిద్దమవుతోంది. దీంతో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న తమన్నా ముద్దు సీన్స్‌పై మరోసారి స్పందించింది.

news18-telugu
Updated: November 14, 2019, 7:44 AM IST
ముద్దులకు దూరం.. మిల్కీ బ్యూటీ తమన్నా
Instagram/tamannaahspeaks
  • Share this:
Tamannaah Bhatia : మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పటి వరకు తెరపై హాట్‌గా  అదరగొడుతూ.. తగిన మోతాదుల్లో అందాలు ఆరబోయడం చూశాం కానీ.. తన పెదవులను ముద్దాడే అవకాశం ఏ హీరోకూ ఇవ్వలేదు. ముందు నుంచీ మిల్కీ బ్యూటీ ముద్దు సీన్లకు దూరంగా ఉంటూనే వస్తోంది. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో ట్రెండ్ మారి.. ముద్దు సీన్లు అనేవి సర్వసాధారణం అయ్యాయి. అయినా కూడా.. తమన్నా మాత్రం తను పెట్టుకున్న కట్టుబాటు దాటి ముందుకు రావడం లేదు. మొదట్లో లిప్ లాక్ సీన్లు అంటే హాలీవుడ్ సినిమాల్లో మాత్రమే ఉంటాయి అనుకునే వారు.. కానీ ఆ సంస్కృతి మొదట హిందీ సినిమాలకు పాకింది. ఆ తర్వాత అన్ని సినిమా ఇండస్ట్రీలకు అంటుకొని.. అంతా కామన్ అయ్యింది. అందులో భాగంగా ఈ మధ్య వస్తున్న హీరోయిన్లు కూడా లిప్ లాక్ సీన్లను చాలా ఈజీగా తీసుకుంటున్నా రు. 
Loading...

View this post on Instagram
 

Styled by - @sukritigrover Wearing - @papadontpreachbyshubhika makeup - @sonamdoesmakeup Hair - @tinamukharjee Photo credit - @kadamajay


A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) on

అది అలా ఉంటే తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా లిప్ లాక్ లపై తాను తీసుకున్న నిర్ణయాన్ని మరోసారి చెప్పుకొచ్చింది. లిప్ లాక్ సన్నివేశాలలో నటించబోనని స్పష్టం చేసింది. కారణాలు ఏమైనా సినీపరిశ్రమలో అడుగు పెట్టినప్పుడే ముద్దు సన్నివేశాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలిపింది తమన్నా. ఆమె ప్రస్తుతం విశాల్ సరసన 'యాక్షన్' అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా నవంబరు 15న విడుదలకు సిద్దమవుతోంది. సి.సుందర్‌ దర్శకత్వం వహించాడు. దీంతో  ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న తమన్నా మాట్లాడుతూ.. మొదట నుండి ముద్దు సీన్లలోనూ నటించకూడదని నిర్ణయించుకున్నానని తెలిపింది. అంతేకాదు ఇప్పటికీ అదే నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని.. నా నిర్ణయాన్ని మార్చుకోవాలని నేనెప్పుడూ అనుకోలేదని తమన్నా చెప్పింది. తమన్నా.. ప్రస్తుతం హిందీలో నవాజుద్దీన్‌ సిద్ధిఖీతో కలిసి ‘బోలే చుడియన్’ అనే సినిమా చేస్తోంది. మహేశ్‌బాబు ‘సరిలేరు నీకెవ్వరు’లో  ఓ ఐటెట్ నంబర్‌లో మెరవనుంది.

శరీరాన్ని విల్లులా వంచిన తమన్నా..

First published: November 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com