హోమ్ /వార్తలు /సినిమా /

Tamannaah: గుర్తుందా శీతాకాలం రిలీజ్ డేట్ ఫిక్స్.. ఇది యూత్ లైఫ్ ప్రేమకథల సమహారం!!

Tamannaah: గుర్తుందా శీతాకాలం రిలీజ్ డేట్ ఫిక్స్.. ఇది యూత్ లైఫ్ ప్రేమకథల సమహారం!!

Photo Twitter

Photo Twitter

Gurtunda Seetakalam Release date: సత్యదేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నటించిన సినిమా 'గుర్తుందా శీతాకాలం'. నాగ శేఖర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా నిజ జీవిత సంఘటనలకు దగ్గరగా ఉండే కథ, కథనంతో రూపొందింది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.

ఇంకా చదవండి ...

టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్స్ సత్యదేవ్ (Satyadev), మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah) జంటగా నటించిన సినిమా 'గుర్తుందా శీతాకాలం' (Gurtunda Seetakalam). నాగ శేఖర్ (Naga Shekar) తెరకెక్కిస్తున్న ఈ సినిమా నిజ జీవిత సంఘటనలకు దగ్గరగా ఉండే కథ, కథనంతో రూపొందింది. ప్ర‌తీ ఒక్క‌రు త‌మ జీవితంలో సెటిల్ అయిన తర్వాత కొన్ని విష‌యాల్ని ఎప్ప‌టికీ మ‌రిచిపోరు. ముఖ్యంగా టీనేజ్, కాలేజ్ ఆ తర్వాత వ‌చ్చే యూత్ లైఫ్‌లో జ‌రిగే సంఘ‌ట‌న‌లు జీవితాంతం గుర్తుకు వ‌స్తూనే ఉంటాయి. ఇలాంటి ఆహ్లాద‌క‌ర‌మైన సంఘ‌ట‌ణ‌లు ప్రేక్ష‌కుల‌కి గుర్తు చేసే ఉద్దేశంతో నాగ‌శేఖ‌ర్ మూవీస్ బ్యాన‌ర్, మణికంఠ ఎంటర్‌టైన్మెంట్స్, వేదాక్షర ఫిల్మ్స్ బ్యానర్స్‌పై భావ‌న‌ ర‌వి, నాగశేఖర్, రామారావు చింతపల్లి, ఎమ్ ఎస్ రెడ్డి, చిన‌బాబు సంయుక్తంగా ఈ గుర్తుందా శీతాకాలం నిర్మించారు.

క‌న్న‌డ‌లో విడుద‌లై సూప‌ర్ హిట్ అయిన ‘ల‌వ్ మాక్‌టైల్’ ఆధారంగా ‘గుర్తుందా శీతాకాలం’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. గత కొన్ని నెలలుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ గుర్తుందా శీతాకాలం ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. ఇప్ప‌టికే ఈ సినిమా టైటిల్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. టాలెంటెడ్ హీరో స‌త్యదేవ్, త‌మ‌న్నా, మేఘా ఆకాష్, కావ్య‌శెట్టి తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై హైప్ పెరిగింది. ఇండ‌స్ట్రీలో వ‌ర్గాల్లోనూ ఈ సినిమాపై ప్ర‌త్యేక ఆస‌క్తి నెల‌కొంది.

ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ సాంగ్ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది. సత్యదేవ్, తమన్నా కెమిస్ట్రీ ఈ పాటలో హైలైట్ అయింది. ఆన్ లైన్ మాధ్యమాల్లో ఈ సాంగ్ వైరల్ అయింది. భారీగా వ్యూస్ రావడంతో చిత్రయూనిట్ ఆనందం వ్యక్తం చేసింది. మొత్తానికి ఈ సినిమాను జులై 15న భారీ ఎత్తున విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు దర్శక నిర్మాతలు.

ఈ చిత్రానికి కాల‌భైర‌వ‌ సంగీతం అందిస్తుండగా.. భావ‌న ర‌వి, నాగ శేఖర్, రామారావు చింతపల్లి నిర్మాతలుగా వ్యవహరించారు. నాగ‌శేఖ‌ర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో తమన్నా అందాలు స్పెషల్ అట్రాక్షన్ కానున్నాయని తెలుస్తోంది. యూత్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే పాయింట్‌తో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నామని మేకర్స్ అంటున్నారు. సో.. చూడాలి మరి ఈ సినిమా ఏ మేర అలరిస్తుందనేది!.

First published:

Tags: Satyadev, Tamannah, Tollywood

ఉత్తమ కథలు