Tamannaah: కరోనా క్రైసిస్ ఛారిటీకి తమన్నా విరాళం..

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాధి అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఈ మహామ్మారికి రాజు,పేద, పెద్దా, చిన్నా అనే తేడా లేకుండా అందరినీ భయపెడుతోంది. తాజాగా కరోనా నేపథ్యంలో పని లేకుండా పోయిన సినీ కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్ ఛారిటీ కోసం విరాళం ప్రకటించింది.

news18-telugu
Updated: April 19, 2020, 1:18 PM IST
Tamannaah: కరోనా క్రైసిస్ ఛారిటీకి తమన్నా విరాళం..
తమన్నా (File/Photo)
  • Share this:
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాధి అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఈ మహామ్మారికి రాజు,పేద, పెద్దా, చిన్నా అనే తేడా లేకుండా అందరినీ భయపెడుతోంది. అంటువ్యాధి అయిన కరోనాను అరికట్టేందకు కేంద్రం ఇప్పటికే దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మరో 19 రోజులు పొడిగించింది. ఈ లాక్‌డౌన్ కారణంగా చాలా మందికి పనిలేకుండా పోయింది. మరోవైపు దినసరి కూలీలకు ఈ లాక్‌డౌన్‌తో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వీరిని ఆదుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వంతు సాయం చేస్తున్నాయి. వీరికి చేదోడు వాదోడుగా సినీ నటులు సెలబ్రిటీలు కూడా తమ వంతుగా పేదలను, సినీ కార్మికులను ఆదుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఇప్పటి వరకు కరోనా బాధితుల కోసం హీరోలు, కమెడియన్లు, దర్శకులు, నిర్మాతలు తమ వంతుగా విరాళాలు అందజేయడంతో పాటు తమ వంతుగా సాయం చేస్తున్నారు. ఇప్పటి వరకు హీరోయిన్లు మాత్రం సరిగా  స్పందించడం లేదనే విమర్శలు వచ్చాయి. కానీ ఇపుడిపుడే హీరోయిన్స్ కూడా తమ వంతు సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు.

tamanna web series,tamanna to act in web series,Samantha to act in web series,Samantha web seriesKajal news,Kajal web series,Kajal digital,Kajal Aggarwal web series,Kajal Aggarwal to act in web series,Kajal Aggarwal web series,kajal aggarwal,kajal aggarwal movies,kajal aggarwal kiss,kajal agarwal new movie,kajal aggarwal songs,kajal agarwal movie,kajal agarwal latest,web series,kajal aggarwal images,kajal aggarwal sita,kajal aggarwal movie,samantha latest,samantha hot songs,lesbian web series,కియారా,కాజల్,వెబ్ సిరీస్,తమన్నా వెబ్ సిరీస్
తమన్నా Photo : Twitter


హీరోయిన్ ప్రణీత  మాత్రం 50 కుటుంబాలకు అండగా నిలిచింది. వాళ్లకు నెలకు సరిపడా నిత్యావసరాలు అందిస్తోంది. ఇక లావణ్య త్రిపాఠి సినీ కార్మికుల కోసం లక్ష రూపాయల విరాళాన్ని ప్రకటించింది. అంతేకాదు కొన్ని మాస్కులు, శానిటైజర్లను పంచిపెట్టింది. ఇక రకుల్ ప్రీత్ సింగ్ గుర్‌గ్రామ్‌లో 250 కుటుంబాలకు లాక్‌డౌన్ ముగిసేంత వరకు భోజనం ఏర్పాట్లు చేసింది. అటు నయనతార కూడా దక్షిణాది సినీ కార్మికుల కోసం రూ. 20 లక్షల విరాళం ప్రకటించింది. మరో కథానాయిక కాజల్ అగర్వాల్ కూడా చిరంజీవి నేతృత్వంలో ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్ ఛారిటీ కోసం రూ. 2 లక్షల విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా కూడా సినీ కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్ ఛారిటీ కోసం రూ. 3 లక్షల విరాళం ప్రకటించింది. మొత్తంగా కరోనాపై పోరాటంతో హీరోయిన్స్ కూడా తమ వంతు సాయం చేయడానికి ముందుకు రావడం ఆనందించదగ్గ విషయమనే చెప్పాలి.
Published by: Kiran Kumar Thanjavur
First published: April 19, 2020, 1:18 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading