ఆ విషయంలో నయనతారకు అన్యాయం జరిగిందా..?

సైరాలో నయనతార

Nayanthara: నయనతార.. దక్షిణాది సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్. సినిమాలో ఒక పాత్ర ఇస్తే ఆ పాత్రకు ప్రాణం పోసే స్థాయి నటన ఈమెది. చరిత్రకు సంబంధించిన కేరెక్టర్ అయినా, పురాణాలకు సంబంధించిన పాత్ర అయినా.. అలవోకగా చేసేయగల అద్భుత నటి.

 • Share this:
  నయనతార.. దక్షిణాది సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్. సినిమాలో ఒక పాత్ర ఇస్తే ఆ పాత్రకు ప్రాణం పోసే స్థాయి నటన ఈమెది. చరిత్రకు సంబంధించిన కేరెక్టర్ అయినా, పురాణాలకు సంబంధించిన పాత్ర అయినా.. అలవోకగా చేసేయగల అద్భుత నటి. సినిమా ఏదైనా సరే.. ఆమెకు గుర్తింపు కచ్చితంగా వస్తుంది. చంద్రముఖి, గజిని, లక్ష్మి,తులసి,అదుర్స్, బాస్, వల్లభ.. ఇలా ప్రతి సినిమాలో నయనతార నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. బాపు చిత్రం, బాలయ్య సరసన శ్రీరామరాజ్యంలో సీత పాత్ర చేసి.. అచ్చం సీత అంటే ఇలాగే ఉంటుందా? అని ప్రేక్షకులు ఆమె నటనకు ముగ్ధులైపోయారు. సింహ సినిమాలో ఆమె నటనకు జేజేలు కొట్టాల్సిందే. డైలాగ్ డెలివరీ.. రోమాలు నిక్కపొడిచేలా ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు నయనతార యాక్టింగ్ ఏ రేంజ్‌లో ఉంటుందో.

  Sye Raa Narasimha Reddy movie review and Chiranjeevi comes up with a inspirational subject pk కొన్ని రోజులుగా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు సైరా నరసింహా రెడ్డి. ఉయ్యాలవాడ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పుడు విడుదలైంది. మరి ఈ చిత్రంతో చిరంజీవి ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించాడు..? sye raa review,chiranjeevi sye raa movie,sye raa movie twitter,sye raa movie first reivew,sye raa movie review,sye raa,sye raa narasimha reddy,sye raa review,sye raa movie,sye raa usa review,sye raa narasimha reddy review,sye raa narasimha reddy movie review,sye raa trailer,sye raa narasimha reddy movie,sye raa public talk,sye raa chiranjeevi,sye raa trailer review,sye raa telugu movie,sye raa video songs,telugu cinema,సైరా,సైరా రివ్యూ,సైరా మూవీ రివ్యూ,సైరా పబ్లిక్ రెస్పాన్స్,తెలుగు సినిమా
  సైరా పోస్టర్


  అయితే, తాజాగా విడుదలైన సైరా సినిమాలో మాత్రం నయనతారకు అన్యాయం జరిగిందని సినీ వర్గాలు కోడై కూస్తున్నాయి. వాస్తవానికి ఏదైనా సినిమాలో నయనతార ఉందంటే.. కచ్చితంగా ఆమె హైలైట్ అవుతుంది. ఒకానొక సందర్భంలో హీరోను సైతం డామినేట్ చేసే సత్తా ఆమెది. సైరా విషయానికి వచ్చేసరికి మాత్రం.. నయన్‌కు తగిన గుర్తింపు రాలేదట. అందులో నరసింహారెడ్డి(చిరంజీవి) భార్యగా నటించినా.. ఆమెకు దక్కాల్సిన గుర్తింపు దక్కలేదట.

  సైరా షూటింగ్‌లో తమన్నా, నయనతార


  వాస్తవానికి సైరాలో ‘లక్ష్మి’ క్యారెక్టర్ చేసిన తమన్నాకు బోలెడంత పేరొచ్చింది. చిరంజీవి తర్వాత తమన్నాకే ఎక్కువ పేరొచ్చిందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా ఫైట్లు, డైలాగ్స్,పాటల్లో, డ్యాన్సుల్లో తమన్నా అదరగొట్టేసిందని అంటున్నారు. నయనతార యాక్టింగ్‌ను డామినేట్ చేసేలా తమన్నా యాక్టింగ్ ఉందని, ఆమె ఎక్కడికో వెళ్లిపోతుందని వెల్లడిస్తున్నారు. నిజానికి బాహుబలి సినిమాలోనే తమన్నాకు ఎక్కువ గుర్తింపు రావాల్సి ఉండేదని, కానీ, తక్కువ నిడివి ఉండటం వల్ల హైలైట్ కాలేకపోయిందని స్పష్టం చేస్తున్నారు. ఏదేమైనా.. సైరా సినిమాలో నయనతారకు అన్యాయం జరిగిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటు నయన్ కూడా అభిమానులు మదనపడుతున్నారు.
  First published: