ఎప్పటికైనా అలాంటి చిత్రంలో నటించడమే తన కల అంటున్న తమన్నా..

చిన్నపుడే చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టాలనే తపనతో ఈ ఇండస్ట్రీలో లెగ్ పెట్టింది తమన్నా.కెరీర్‌ స్టార్టింగ్‌లో అపజయాలు ఎదురైన ఎక్కడా కృంగిపోకుండా.. తనదైన శైలిలో హీరోయిన్‌గా రాణించింది.తాజాాగా తమన్నాకు ఒక తీరని కోరిక ఉంది.ఇంతకీ అదేమిటంటే..

news18-telugu
Updated: June 6, 2019, 9:20 PM IST
ఎప్పటికైనా అలాంటి చిత్రంలో నటించడమే తన కల అంటున్న తమన్నా..
తమన్నా భాటియా హాట్ (Source: Twitter)
  • Share this:
చిన్నపుడే చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టాలనే తపనతో ఈ ఇండస్ట్రీలో లెగ్ పెట్టింది తమన్నా.కెరీర్‌ స్టార్టింగ్‌లో అపజయాలు ఎదురైన ఎక్కడా కృంగిపోకుండా.. తనదైన శైలిలో హీరోయిన్‌గా రాణించింది. అంతేకాదు చిన్నప్పటి నుంచి మాధురి దీక్షిత్ డాన్సులు చూసి తాను అలాంటి డాన్సరే కావాలని కలలు కనడమే కాదు.. అందుకు తగ్గట్టు కఠోర శ్రమ చేసింది కూడా మిల్కీ బ్యూటీ. అంతేకాదు ‘అభినేత్రి’తో పాటు పలు సినిమాల్లో తన డ్యాన్సులతో కుర్రకారును గిలిగింతలు పెట్టింది. అంతేకాదు ఎప్పటికైనా నృత్య ప్రధానంగా సాగే చిత్రం చేయడమే తన కల అని చెబుతుంది తమన్నా. నటిగా 14 ఏళ్లు  కంప్లీట్ చేసుకున్న ఈ వైట్ బ్యూటీ.. ఇపుడే కొత్తగా ఇండస్ట్రీలో తన ప్రయాణాన్ని మొదలుపెట్టినట్టుగా ఉందని చెబుతోంది. అంతేకాదు అనుభవం పెరిగేకొద్ది ఎలాంటి పాత్రలు చేయాలనే దానిపై నాకు కూడా క్లారిటీ వచ్చిందని చెబుతుంది. అంతేకాదు క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసుకోవడంలో నేను పరిణితిని ప్రదర్శిస్తున్నాను. ఇపుడు చూస్తే నాకు నేను కొత్తగా కనిపిస్తున్నట్టు చెప్పుకొచ్చింది.

First published: June 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>