స్టార్ హీరోయిన్ తమన్నా (Tamannaah) అంటే తెలియని సినీ ప్రేక్షకుడు ఉండడు. తన మిల్కీ అందాలతో వెండితెరపై గ్లామర్ ట్రీట్ ఇస్తూ వస్తున్న ఈ బ్యూటీకి భారీ ఫాలోయింగ్ ఉంది. శ్రీ (Sree) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ హ్యాపీ డేస్ (Happy Days) సినిమాతో కెరీర్లో టర్న్ తీసుకుంది. ఆ తర్వాత వరుసపెట్టి స్టార్ హీరోల సినిమాల్లో నటించి పలు బ్లాక్ బస్టర్ హిట్స్ ఖాతాలో వేసుకుంది. తెలుగులో దాదాపు అందరు స్టార్ హీరోల సరసన ఆడిపాడిన తమన్నా.. తన అందాలతో తమిళ, హిందీ ప్రేక్షకులను కూడా ఆకర్షించింది. అలా సూపర్ ఫామ్ కొనసాగిస్తున్న ఈ బ్యూటీ తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేసి జనం నోళ్ళలో నానిపోతోంది.
సినీ కెరీర్ కొనసాగిస్తూనే సోషల్ మీడియాలో యమ యాక్టివ్ రోల్ పోషిస్తుండటం తమన్నా నైజం. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ అప్డేట్స్ పంచుకునే ఈ బ్యూటీ.. తాజాగా తాను అబ్బాయిలా ట్రాన్స్ఫామ్ అయిన ఓ వీడియో పోస్ట్ చేసి ఊహించని ట్విస్టిచ్చింది. ఈ ఇన్స్టాగ్రామ్ రీల్ వీడియోలో మొదట శారీలో గ్లామర్ టచ్ ఇచ్చిన తమ్మూ.. ఉన్నట్టుండి ప్యాంటు షర్ట్ ధరించి అబ్బాయిగా మారి షాకిచ్చింది. డోర్ ముందు నిలబడి చీర కట్టులో కనిపించిన ఆమె.. డోర్ క్లోజ్ అయి మళ్ళీ ఓపెన్ అయ్యేసరికి అబ్బాయిలా మారడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ప్రస్తుతం ఈ ట్రాన్సపర్మేషన్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఇటీవల తమన్నా నటించిన F3 సినిమాలో కూడా కొన్ని సీన్లలో అబ్బాయిలా నటించింది తమన్నా. అందులోని ఓ గెటప్ ఇది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమన్నా సూపర్, బ్యూటిఫుల్ అంటూ ఆమె అందాలను తెగ పొగిడేస్తున్నారు. 100% లవ్, ఆగడు, ఊపిరి, రచ్చ, రెబల్, బద్రీనాథ్, బెంగాల్ టైగర్, బాహుబలి, F2 లాంటి సినిమాలతో ఫేమస్ అయిన తమన్నా.. ఐటెం సాంగ్స్ చేయడానికి కూడా వెనకాడటం లేదు.
View this post on Instagram
ఇటీవలే సరిలేరు నీకెవ్వరూ సినిమాలో మహేష్ బాబుతో ఐటెం సాంగ్ చేసి కిక్కిచ్చిన తమన్నా.. ఇప్పుడు 'గుర్తుందా శీతాకాలం' అనే సినిమాలో నటిస్తోంది. దీంతో పాటు మెగాస్టార్ చిరంజీవి హీరోగా రాబోతున్న 'భోళా శంకర్' మూవీలో భాగమవుతోంది. వీటితో పాటు కొత్త సినిమాల వేట కొనసాగిస్తోంది తమన్నా. తన రోల్ నచ్చాలే గానీ పాత్ర పరిధి లెక్కచేయను అన్నట్లుగా దూసుకుపోతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.