ఆపమ్మా నీ నీతులు...తమన్నాను టార్గెట్ చేస్తున్న నెటిజన్స్...ఎందుకంటే?

All Lives Matter | మనిషైనా..జంతువైనా..ప్రతి ప్రాణం ముఖ్యమే కదా? అంటూ సోషల్ మీడియాలో తమన్నా ఇచ్చిన స్టేట్‌మెంట్‌పై నెటిజన్లు కౌంటర్ అటాక్ చేస్తున్నారు. నెటిజన్ల ఆగ్రహానికి కారణం లేకపోలేదు.

news18-telugu
Updated: June 6, 2020, 9:21 AM IST
ఆపమ్మా నీ నీతులు...తమన్నాను టార్గెట్ చేస్తున్న నెటిజన్స్...ఎందుకంటే?
సినీ నటి తమన్నా(Twitter)
  • Share this:
ఎరక్కపోయి ఇరుక్కోవడం అంటే ఇదేనేమో...సోషల్ మీడియాలో మిల్కీ బ్యూటీ తమన్నా ఓ మంచి సందేశం ఇచ్చింది. అయితే ఇదే అంశంపై నెటిజన్స్ ఆమెపై రివర్స్ అటాక్ చేస్తున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే..అమెరికాలో నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్య, కేరళలో ఏనుగు హత్యపై తీవ్రస్థాయిలో స్పందిస్తూ పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. ప్రాణం ఎవరిదైనా ఒక్కటే కదా అన్నట్లు...సారా అలీ ఖాన్ చేసిన ఓ స్టేట్‌మెంట్ సోషల్ మీడియాలో వివాదాస్పదం అయ్యింది కూడా.

ఇదే అంశంపై ఇప్పుడు తమన్నా సోషల్ మీడియాలో ఓ స్టేట్‌మెంట్ ఇచ్చింది. నల్లజాతీయులకు సంఘీభావం ప్రకటిస్తున్నట్లు ఓ బ్లాక్ అండ్ వైట్ ఫోటోను కూడా పోస్ట్ చేసింది. ఇలాంటి సంఘటనలపై ప్రతి ఒక్కరూ స్పందించాలని తన స్టేట్‌మెంట్‌లో కోరింది. ‘మీ మౌనం నిన్ను కాపాడదు. మనిషైనా..జంతువైనా..ప్రతి ప్రాణం ముఖ్యమే కదా? మనం మనిషిగా జీవించడం మళ్లీ నేర్చుకోవాలి’ అంటూ తన సందేశంలో తమన్నా పేర్కొంది.
అంత వరకు బాగానే ఉన్నా...ఇప్పుడు ఆమెపై నెటిజన్స్ రివర్స్ అటాక్ మొదలుపెట్టారు. ఇందుకు కారణం లేకపోలేదు...ఇప్పుడు నల్ల జాతీయులకు సంఘీభావం తెలిపేలా వ్యాఖ్యలు చేస్తున్న తమన్నా...గతంలో ఫెయిర్ అండ్ లౌలీ యాడ్స్‌లో నటించడమే విమర్శలకు కారణం. గతంలో తెలుపు రంగును ప్రమోట్ చేసేందుకు ఫెయిర్ అండ్ లౌలీ యాడ్స్‌లో నటించిన తమన్నా..ఇప్పుడు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందంటూ నెటిజన్స్ మండిపడుతున్నారు.దీంతో సోషల్ మీడియాలో ట్రోల్స్ బాధితుల జాబితాలో తమన్నా కూడా చేరిపోయింది.


Published by: Janardhan V
First published: June 6, 2020, 9:21 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading