news18-telugu
Updated: November 26, 2020, 10:20 AM IST
ముంబై వీధుల్లో తమన్నా..Photo : Twitter
Tamannaah Bhatia : తమన్నా ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లైపోయింది. ఇన్నేళ్లలో 50కి పైగా సినిమాల్లో నటించింది తమన్నా. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ సినిమాల్లోనూ నటిస్తూ తన సత్తాను చాటుతోంది తమన్నా. ఈ భామ ప్రస్తుతం గోపిచంద్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న 'సీటీమార్' చిత్రంలో హీరోయిన్గా చేస్తోంది. ఇక ఇటీవల కరోనా బారిన పడిన తమన్నా.. కరోనాకు చికిత్స పొంది సురక్షితంగా బయటపడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొంత విశ్రాంతి అనంతరం తిరిగి షూటింగులతో బిజీ అయిపోయింది. ఏడెనిమిది నెలల విరామం అనంతరం షూటింగుల కోసం విమానాశ్రయాల వెంట పరిగెత్తుతూ అందుకు సంబంధించిన ఫోటోల్ని మిల్కీ బ్యూటీ షేర్ చేసింది. అది అలా ఉంటే.. తాజాగా తమన్నా షేర్ చేసిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముంబై వీధుల్లో ఇలా బ్లాక్ లెదర్ బ్యాగ్ తో ప్రత్యక్షమైంది. ఆ ఫోటోలో తమన్నా ధరించిన థై హై డ్రెస్ మాత్రం వీక్షకుల కంటికి కనువిందుగా ఉంది. పసుపు తెలుపు గడుల ఫ్రాకు ఆమె సొగసుల్ని ఎలివేట్ చేసింది. దీంతో ఆ ఫోటోపై నెటిజన్స్ అనేక రకాల కామెంట్స్ పెడుతున్నారు. వావ్ తమన్నా అంటూ తమ అభిమానాన్ని కామెంట్స్ రూపంలో పోస్ట్ చేస్తున్నారు.
ఇక తమన్నా ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే.. ఆమె ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో వస్తోన్న స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తోంది. ఈ సినిమాలో మరో ప్రధాన పాత్రలో గోపీచంద్ నటిస్తున్నాడు. `ది నవంబర్ స్టోరీ` అనే ఓ వెబ్ సిరీస్లోను తమన్నా నటిస్తోంది. వీటితో పాటు గుర్తుందా శీతాకాలం`.. అనే సినిమాతో పాటు నితిన్ అంధాధున్ తెలుగు రీమేక్ లలో తమన్నా నటిస్తోంది.
Published by:
Suresh Rachamalla
First published:
November 26, 2020, 10:13 AM IST