Home /News /movies /

TAMANNAAH BHATIA SENDS LEGAL NOTICE TO MASTER CHEF PRODUCTION HOUSE HERE ARE THE DETAILS SR

Tamannaah Bhatia : తమన్నా ప్లేసులో అనసూయ... టీవీ యాజమాన్యానికి లీగల్ నోటీసులు..

Tamannaah Bhatia Photo : Instagram

Tamannaah Bhatia Photo : Instagram

Tamannaah Bhatia : తమన్నా అందం గురించి, నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మంచు మనోజ్ నటించిన శ్రీ అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయమయ్యారు. ఆతర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన హ్యాపీ డేస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక అది అలా ఉంటే తమన్నా ఓ షో యాజమాన్యానికి షాక్ ఇచ్చారు. తనకు రావాల్సిన బ్యాలెన్స్ అమౌంట్ ఇవ్వాలంటూ నోటీసులు పంపారు.

ఇంకా చదవండి ...
  తమన్నా (Tamannaah Bhatia) అందం గురించి, నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మంచు మనోజ్ నటించిన శ్రీ అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయమయ్యారు. ఆతర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన హ్యాపీ డేస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక సినిమా తర్వాత తమన్నా వెనుకగా చూసుకోలేదు. బ్యాక్ టు బ్యాక్ స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్‌లు దక్కించుకున్నారు. చూస్తుండ‌గానే త‌మ‌న్నా ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 15 ఏళ్లైపోయింది. ఇన్నేళ్ల‌లో 50కి పైగా సినిమాల్లో న‌టించింది అదరగొట్టింది (Tamannaah Bhatia) త‌మ‌న్నా. తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ సినిమాల్లోనూ న‌టిస్తూ తన సత్తాను చాటుతోంది త‌మ‌న్నా. ప్రస్తుతం తెలుగులో పలు సినిమాల్లో నటిస్తున్నారు. ఇక అది అలా ఉంటే తమన్నా ఇటీవల టీవీలో ఓ ప్రోగ్రామ్‌లో మెరిసిన సంగతి తెలిసిందే. ప్రముఖ తెలుగు జనరల్ ఎంటర్టైన్‌మెంట్ ఛానెల్ రూపొందించిన ఓ కుకింగ్ షో కార్యక్రమానికి తమన్నా హోస్ట్ గా వ్యవహరించారు.

  మొదటి రెండు మూడు షోలకు మంచి రేటింగ్స్ వచ్చినప్పటికి ఆ తర్వాత పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఆమె ప్లేసులో ప్రముఖ టీవీ యాంకర్ అనసూయను దించారు నిర్వాహకులు. ఈ నేపథ్యంలో తమన్నా షో యాజమాన్యానికి షాక్ ఇచ్చారు. తనకు రావాల్సిన బ్యాలెన్స్ అమౌంట్ ఇవ్వాలంటూ నోటీసులు పంపారని సమాచారం.

  Akhil Akkineni : బ్యాచ్‌లర్ తొమ్మిది రోజుల కలెక్షన్స్.. బ్రేక్ ఈవెన్ సాధించి.. మూడు కోట్ల లాభం..

  తనను తొలగించారన్న అసంతృప్తితో ఉన్న తమన్నా తనకు యాజమాన్యం నుంచి రావాల్సన బకాయిలను చెల్లించాలని ప్రొడక్షన్ హౌస్‌కు లీగల్ నోటీసులు పంపారని తెలుస్తోంది. మరి ఈ నోటీసుల పై షో యాజమాన్యం ఎలా స్పందిస్తుందో అని ఆసక్తిగా చూస్తున్నారు ఆమె అభిమానులు.

  ఇక తమన్నా ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు వెబ్‌ సిరీస్‌‌లు కూడా చేస్తున్నారు. అందులో భాగంగా ఆమె నటించిన ఈ తాజా వెబ్ సీరీస్ పేరు 'నవంబర్ స్టోరీ'. తమిళ దర్శకుడు ఇంద్ర సుబ్రమణియన్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సీరీస్ మంచి ఆదరణ పొందింది. క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో వచ్చిన ఈ తాజా వెబ్ సిరీస్‌లో తమన్నా ఒక హ్యాకర్ పాత్ర పోషించింది. ఆమె నటించిన మరో వెబ్ సిరీస్‌ ‘లెవన్త్‌ అవర్‌’. ఈ వెబ్ సిరీస్ ఆహాలో ప్రసారం అయ్యి పరవాలేదనిపించింది. ఈ వెబ్ సిరీస్‌కు ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వం వహించారు.

  Kajal Aggarwal : కాజల్ కెరీర్‌లో మరో మైలు రాయి.. అక్కడ చందమామకు ఎదురులేదు..

  ఇక తమన్నా ఇతర సినిమాల విషయానికి వస్తే.. తమన్నా, గోపీచంద్ హీరోగా లేటెస్ట్ సినిమా సీటీమార్‌ అనే చిత్రంలో హీరోయిన్‌గా నటించారు. కబడ్డీ ఆట నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను శ్రీనివాసా చిట్టూరి నిర్మించగా.. సంపత్ నంది దర్శకత్వం వహించారు.

  ఇక ఈ సినిమాతో పాటు తమన్నా నితిన్ అంధాదున్ తెలుగు రీమేక్‌ మాస్ట్రోలో కీలకపాత్రలో కనిపించారు. హిందీలో టబు చేసిన పాత్రలో తమన్నా అదరగొట్టారు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రస్తుతం హాట్ స్టార్‌లో స్ట్రీమ్ అవుతోంది.

  ఇక ఈ సినిమాతో పాటు తమన్నా.. వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన‌్‌లో వచ్చిన బ్లాక్ బస్టర్ F2కు సీక్వెల్‌గా వస్తోన్న F3లో నటిస్తున్నారు. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండగా.. దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 25న విడుదలకానుంది. దీంతో పాటు తమన్నా యువ హీరో సత్యదేవ్‌తో కలిసి 'గుర్తుందా శీతాకాలం' సినిమాలో నటిస్తున్నారు. కన్నడ హిట్ మూవీ 'లవ్ మాక్‌టైల్'కు రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది.
  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Anasuya Bharadwaj, Tamanna, Tamannaah Bhatia, Tollywood news

  తదుపరి వార్తలు