Tamannaah Bhatia: మెగా హీరో సినిమాలో తమన్నా స్పెషల్ సాంగ్‌.. ఈసారి మాములుగా ఉండదుగా?

Tamannaah

Tamannaah Bhatia: వెండితెరపై మెగాహీరోల సత్తా ఏంటో సినిమా సినిమాకి చాటి చెబుతున్నారు. ఈ క్రమంలోనే మెగా హీరోలలో ఒకరైన వరుణ్ తేజ్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. తాజాగా వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "గని" బాక్సింగ్

  • Share this:
    Tamannaah Bhatia: వెండితెరపై మెగాహీరోల సత్తా ఏంటో సినిమా సినిమాకి చాటి చెబుతున్నారు. ఈ క్రమంలోనే మెగా హీరోలలో ఒకరైన వరుణ్ తేజ్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. తాజాగా వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "గని" బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరో వరుణ్ తేజ్ సరసన స‌యీ మంజ్రేక‌ర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్లో ఈ సినిమాకి సంబంధించిన తుది షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన తాజా సమాచారం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

    మెగా హీరో గని సినిమాలో స్పెషల్ సాంగ్ మిగిలి ఉంది. ఈ సాంగ్ లో చేయడం కోసం ఎవరిని తీసుకోవాలనే ఆలోచనలో చిత్రబృందం ఉండగా.. మిల్క్ బ్యూటీ తమన్నా అయితే సరిపోతుందని భావించిన చిత్రబృందం ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించడానికి మేకర్స్ తమన్నాను సంప్రదించినట్టు తెలుస్తోంది. అయితే ఇందులో నటించడానికి మిల్క్ బ్యూటీ ఒప్పుకుంటారా? లేదా? అనే విషయం తెలియాల్సి.

    తమన్నాకు స్పెషల్ సాంగ్ చేయడం కొత్తేమీ కాదు. ఇదివరకే మహేష్ బాబు సినిమాలో  ‘డ్యాంగ్ డ్యాంగ్‌...’ అంటూ మహేష్ సరసన ఆడిపాడి ఎంతోమంది ప్రేక్షకుల మనసును దోచింది. అదేవిధంగా దేశవ్యాప్తంగా సంచలన విజయం సృష్టించిన కేజిఎఫ్ సినిమాలో ‘దోచెయ్ దోర సొగ‌స‌లు దోచెయ్ ..' అంటూ ఆడిపాడింది. ఇది మాత్రమే కాకుండా ఇంతకుముందు అల్లుడు శీను, జాగ్వార్, జై లవకుశ వంటి చిత్రాలలో స్పెషల్ సాంగ్స్ లో నటించి కుర్రకారును మెస్మరైజ్ చేసింది.

    బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న వరుణ్ సందేశ్ గని చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ మేడం కోసం ఈ బ్యూటీ ఒప్పుకుంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది. అయితే ప్రస్తుతం తమన్నా పలు సినిమాలు ,వెబ్ సిరీస్ లో, టీవీ షోలను చేస్తున్న క్రమంలో ఈ సాంగ్ లో చేయడానికి ఒప్పుకుంటారా లేదా అనే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ పాటలో చేయడానికి తమన్నా ఒప్పుకుంటారో లేదో అనే విషయం తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి ఉండాలి.
    Published by:Navya Reddy
    First published: