తమన్నా కెరీర్‌లో తొలిసారి.. ఆయనకు రుణపడిన మిల్కీ బ్యూటీ..

తమన్నా ఇండస్ట్రీకి వచ్చి అప్పుడే 15 ఏళ్ళు దాటిపోయింది. 2005లో శ్రీ సినిమాతో తెలుగు వాళ్లకు పరిచయమైన ఈ బ్యూటీ.. అప్పట్నుంచి ఇప్పటి వరకు వరసగా సినిమాలు చేస్తూనే ఉంది. ఇప్పటికే 50 సినిమాల..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 8, 2020, 2:56 PM IST
తమన్నా కెరీర్‌లో తొలిసారి.. ఆయనకు రుణపడిన మిల్కీ బ్యూటీ..
అన్నింటికి మించి ఈ ముద్దుగుమ్మ ప్రేమలో పడింది. లాక్‌డౌన్ సమయంలోనే ఈమె ప్రేమలో పడింది. అయితే ఈమె ప్రేమలో పడింది మాత్రం మనిషితో కాదు.. ప్రకృతితో.
  • Share this:
తమన్నా ఇండస్ట్రీకి వచ్చి అప్పుడే 15 ఏళ్ళు దాటిపోయింది. 2005లో శ్రీ సినిమాతో తెలుగు వాళ్లకు పరిచయమైన ఈ బ్యూటీ.. అప్పట్నుంచి ఇప్పటి వరకు వరసగా సినిమాలు చేస్తూనే ఉంది. ఇప్పటికే 50 సినిమాల మైలురాయి కూడా అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ఎన్నో సినిమాలు చేసినా కూడా ఇప్పటి వరకు తాను చేయని పాత్ర తనకు ఇచ్చినందుకు దర్శకుడు అనిల్ రావిపూడికి థ్యాంక్స్ చెప్పుకుంది ఈమె. ఈయన తెరకెక్కించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది తమన్నా. అందులో కొత్తేముంది అనుకోవచ్చు కానీ మిలటరీ వాళ్ల మధ్య ఐటం సాంగ్ చేసింది తమన్నా.

తన కెరీర్లో ఇప్పటి వరకు చాలా సినిమాలు చేసినా.. ఐటం సాంగ్స్ కూడా చేసినా కూడా ఇప్పటి వరకు ఎప్పుడూ ఆర్మీ డ్రస్ మాత్రం వేసుకోలేదని చెప్పింది మిల్కీ బ్యూటీ. ఫస్ట్ టైమ్ తన కెరీర్లో ఇలాంటి ఆఫర్ ఇచ్చినందుకు అనిల్ చాలా థ్యాంక్స్ అంటుంది ఈ బ్యూటీ. కచ్చితంగా ఈ పాటతో పాటు సినిమా కూడా ప్రేక్షకులను బాగా అలరిస్తుందని చెబుతుంది. తాజాగా విడుదలైన డాంగ్ డాంగ్ సాంగ్ మేకింగ్ వీడియో కూడా అదిరిపోయింది. ఇందులో అనిల్ రావిపూడి కూడా తమన్నాతో పాట విశేషాలతో పాటు మరిన్ని వివరాలను కూడా తెలిపాడు. ప్రస్తుతం ఈ మేకింగ్ వీడియో వైరల్ అవుతుంది. జనవరి 11న సరిలేరు నీకెవ్వరు విడుదల కానుంది.
Published by: Praveen Kumar Vadla
First published: January 8, 2020, 2:56 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading