త‌మ‌న్నా, కాజ‌ల్ రొమాన్స్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు..

అదేంటి.. త‌మ‌న్నా, కాజ‌ల్ రొమాన్స్ చేసుకోవ‌డం ఏంటి.. మ‌రీ విచిత్రం కాక‌పోతేనూ అనుకుంటున్నారా..? అయినా రెండు కొప్పులు ఒకే ద‌గ్గ‌ర ఉండ‌వు అంటారు కదా.. అలాంటిది ఇద్ద‌రు స్టార్ హీరోయిన్లు ఒకే చోట ఎలా ఉన్నారబ్బా అనుకుంటున్నారా..?

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 11, 2019, 7:57 PM IST
త‌మ‌న్నా, కాజ‌ల్ రొమాన్స్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు..
కాజల్ తమన్నా పిక్స్
  • Share this:
అదేంటి.. త‌మ‌న్నా, కాజ‌ల్ రొమాన్స్ చేసుకోవ‌డం ఏంటి.. మ‌రీ విచిత్రం కాక‌పోతేనూ అనుకుంటున్నారా..? అయినా రెండు కొప్పులు ఒకే ద‌గ్గ‌ర ఉండ‌వు అంటారు కదా.. అలాంటిది ఇద్ద‌రు స్టార్ హీరోయిన్లు ఒకే చోట ఎలా ఉన్నారబ్బా అనుకుంటున్నారా..? అవును.. న‌మ్మ‌డం కాస్త క‌ష్ట‌మే అయినా కూడా ఇప్పుడు ఇదే జ‌రుగుతుంది మ‌రి. నిజంగానే ఇప్పుడు త‌మ‌న్నా, కాజ‌ల్ రొమాన్స్ చేసుకుంటున్నారు. వాళ్ల రొమాన్స్ మ‌ళ్లీ సోష‌ల్ మీడియాలో కూడా పోస్ట్ చేస్తున్నారు.


తాజాగా త‌మ ఇద్ద‌రి మ‌ధ్య ఉన్న కెమిస్ట్రీ చూపించ‌డానికి ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని పిక్స్ షేర్ చేసింది త‌మ‌న్నా. అందులో చంద‌మామ కాజ‌ల్ అగర్వాల్‌తో క‌లిసి అదిరిపోయే పోజిచ్చింది. ఇవిప్పుడు బాగానే వైర‌ల్ అవుతున్నాయి. అస‌లు త‌మ‌న్నా, కాజ‌ల్ మ‌ధ్య కెమిస్ట్రీ చూసి అంతా కుళ్లుకుంటున్నారు కూడా. క్యా సీన్ హై అంటూ అభిమానులు కూడా ఫిదా అయిపోతున్నారు. ఈ ఇద్ద‌రూ క‌లిసి ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క సినిమాలో కూడా క‌లిసి న‌టించ‌లేదు కానీ స్నేహం మాత్రం చాలా ఎక్కువ‌గా ఉంది.

ఈ బంధం బ‌లంగా ధృడంగా క‌నిపిస్తుంది. అయితే క‌లిసి న‌టించ‌క‌పోయినా కూడా క‌లిసి ఒకే సినిమా రీమేక్‌లో న‌టిస్తున్నారు. అదే క్వీన్.. ఈ సినిమా తెలుగు రీమేక్ త‌మ‌న్నా చేస్తుంటే.. త‌మిళ రీమేక్ కాజ‌ల్ చేస్తుంది. దాంతో అక్క‌డ ఈ ఇద్ద‌రి మ‌ధ్య మ‌రింత స్నేహం ఏర్ప‌డింది. ఏదేమైనా ఇప్పుడు త‌మ‌న్నా, కాజ‌ల్ మ‌ధ్య ఉన్న స్నేహాన్ని, కెమిస్ట్రీని చూసి ఫ్యాన్స్ పండ‌గ చేసుకుంటున్నారు. హీరోలే కాదు.. హీరోయిన్లు కూడా ఈ మ‌ధ్య ఇంత‌గా క‌లిసిపోతుంటే అది చూసి అభిమానులు కూడా వారెవ్వా అనుకుంటున్నారు.
First published: May 11, 2019, 7:56 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading