HOME »NEWS »MOVIE »tamannaah bhatia interesting comments on her cine career and her struggles in film industry sr

Tamannaah Bhatia : గతాన్ని తల్చుకొని బాధపడను.. ఆ విషయంలో పాఠాలు నేర్చుకున్నా : తమన్నా..

Tamannaah Bhatia : గతాన్ని తల్చుకొని బాధపడను.. ఆ విషయంలో పాఠాలు నేర్చుకున్నా  : తమన్నా..
తమన్నా Photo : Instagram

Tamannaah Bhatia : త‌మ‌న్నా ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 15 ఏళ్లు దాటింది. టీనేజ్‌లోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తమన్నా ఇన్నేళ్ల‌లో 50కి పైగా సినిమాల్లో న‌టించింది.

  • Share this:
    Tamannaah Bhatia : త‌మ‌న్నా ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 15 ఏళ్లు దాటింది. టీనేజ్‌లోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తమన్నా ఇన్నేళ్ల‌లో 50కి పైగా సినిమాల్లో న‌టించింది. తన డ్యాన్సులతో పాటు, తగినన్ని అంద చందాలను కూడా వీలున్నప్పుడల్లా ఆర బోస్తూ తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ సినిమాల్లోనూ న‌టిస్తూ తన సత్తాను చాటుతోంది త‌మ‌న్నా. కాగా తాజాగా తమన్నా తన కెరీర్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. గతాన్ని తల్చుకొని పశ్చత్తాపపడను. అదేవిధంగా భవిష్యత్తుకు అందంగా మార్చుకోవాలనీ ప్రణాళికల్ని వేసుకోను. ఎప్పుడూ వర్తమానంలోనే జీవిస్తూ నిర్ణయాల వల్ల వైఫల్యాల జరిగితే వాటి నుంచి పాఠాలను నేర్చుకుంటానని తెలిపింది. ఆమె ఇంకా మాట్లాడుతూ.. కెరీర్ మొదట్లో కొందరి విమర్శల్ని తీసుకుని చాలా బాధపడేదాన్ని అని అంతేకాకుండా.. కొన్ని సినిమాలను విజయం సాధించకపోవడంతో అదే తల్చుకొని తొలినాళ్లలో చాలా బాధపడ్డాను. అంతేకాదు నా కెరీర్‌ ముగిసిపోయిందని అందరూ అనుకున్నారు. అయితే అవేమీ నా ఆత్మవిశ్వాసాన్ని, నా పట్టుదలను దెబ్బకొట్టలేదు. ఆ తర్వాత నేను కష్టపడ్డాను.. నా హార్డ్‌వర్క్‌కు అదృష్టం తోడవ్వడంతోనే పదిహేనేళ్లుగా అభిమానుల్ని అలరిస్తున్నాను అని పేర్కోంది తమన్నా.

    ఇక ప్రస్తుతం తమన్నా చేస్తోన్న సినిమాల విషయానికి వస్తే.. ఈ భామ ప్రస్తుతం గోపిచంద్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న 'సీటీమార్' చిత్రంలో హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమా ఇటీవలే షూటింగ్ ముగించుకుంది. ఇక నితిన్ సినిమాలో కొంత బోల్డ్’గా నటిస్తోంది. నితిన్ హిందీ సూపర్ హిట్ సినిమా అంధాధున్‌ తెలుగులో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను నితిన్ సొంత బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ నిర్మిస్తోంది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నాడు. నితిన్‌కు జోడిగా నభా నటేష్ నటిస్తోంది. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ పాత్ర కాదు.










    కొంత విలనీగా ఉంటూ హీరోకు సమానంగా ఉంటుంది. ఇదే పాత్రను హిందీలో టబు చేసిన సంగతి తెలిసిందే. తమన్నా ప్రస్తుతం 'లెవెంత్‌ అవర్‌' పేరుతో తమన్నా ఓ వెబ్‌సిరీస్‌ చేస్తోంది. వీటితో పాటు తమన్నా తెలుగులో గుర్తుందా శీతాకాలంలో నటిస్తోంది. ఈ సినిమా ఓ కన్నడ సినిమాకు రీమేక్‌గా వస్తోంది. సత్యదేవ్ మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇక బ్లాక్ బస్టర్ F2కు సీక్వెల్‌గా వస్తోన్న F3లో కూడా తమన్నా నటిస్తోంది. ఇక ఆమె నటించిన దటీజ్ మహాలక్ష్మి ఇంకా విడుదలకు నోచుకోలేదు. ఈ సినిమా కంగనా రనౌత్ హిందీ సూపర్ హిట్ క్విన్‌కు రీమేక్ వస్తోంది. షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఏవో కారణాల వల్ల విడుదలకు నోచుకోలేదు.
    Published by:Suresh Rachamalla
    First published:January 24, 2021, 06:49 IST