దాదాపు రెండు దశాబ్దాలుగా స్టార్ హీరోయిన్ గా కెరీర్ కొన సాగిస్తుంది మిల్క్ బ్యూటీ తమన్నా (Tamannaah Bhatia) ఆమె నటించిన తాజా చిత్రం (Gurtunda Seetakalam) "గుర్తుందా శీతాకాలం".. ఈ చిత్ర ద్వారా మన జీవితంలోని మొదటి ప్రేమ మ్యాజిక్, అందమైన రొమాంటిక్ క్షణాలను ఎప్పటికి మరచిపోలేము అటువంటి జ్ఞాపకాలను మరోసారి గుర్తుచేస్తూ యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే రొమాంటిక్ ఎంటర్టైనర్ మన ముందుకు వస్తుంది.". చినబాబు, ఎంఎస్ రెడ్డి సమర్పణలో శ్రీ వేదాక్షర ఫిలింస్, నాగశేఖర్ మూవీస్, మణికంఠ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై యంగ్ & టాలెంటెడ్ వెర్సటైల్ (Actor Satya Dev) యాక్టర్ సత్యదేవ్, పాన్ ఇండియా యాక్టరస్ తమన్నా భాటియా, మేఘా ఆకాష్, కావ్య శెట్టి, ప్రియదర్శి, సుహాసిని నటిస్తున్నారు. కన్నడలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ నాగశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని చింతపల్లి రామారావు, భావన రవి, నాగశేఖర్ సంయుక్తంగా. నర్మిస్తున్నారు.కాల భైరవ అందించిన సంగీతం మనసును మైమరిచిపోయేలా చేస్తుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని డిసెంబర్ 9న ( (Gurtunda Seetakalam Release date) గ్రాండ్ గా ప్రేక్షకులు ముందుకు వస్తున్న సందర్బంగా మిల్క్ బ్యూటీ తమన్నా పాత్రికేయ మిత్రులతో మాట్లాడుతూ..
రీమేక్ సినిమాలో నటించడం అనేది నాకు కొత్త కాదు. కానీ ఒరిజినాలిటీ ని మిస్ కాకుండా చాలెంజ్ లా తీసుకుని చేస్తాను ఎందుకంటే వాళ్లు అప్పటికే క్యారెక్టర్స్ చేసి ఉంటారు కాబట్టి చూసే ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా ఆ క్యారెక్టర్ చేయడం చాలెంజింగ్ గా తీసుకున్నాము. మిగతా సినిమాలతో చూస్తే లవ్ స్టోరీస్ లలో నటించి ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడం కొంచెం కష్టమే.. కానీ ఈ సినిమాలో నేను చేసిన ఎమోషన్స్ క్యారెక్టరైజేషన్ ఆకట్టుకుంటాయి. సినిమా ను పోలిన సినిమాలు వస్తుంటాయి కానీ అందులో ఏదో కొత్త పాయింట్ ఉంటుంది ఇందులో కూడా కొత్త ఎమోషన్స్, కొత్త పాయింట్ ను ప్రేక్షకులకు చెబుతున్నాము. సత్యదేవ్ తో నటించడం చాలా సంతోషంగా ఉంది. తను నటించిన ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య సినిమా చూసిన తర్వాత ఆయన యాక్టింగ్ చాలా న్యాచురల్ గా అనిపించి తనతో చెయ్యాలని ఇంట్రెస్ట్ కలిగింది.. ఆ తర్వాత ఈ సినిమా ఆఫర్ రావడంతో ఆ కోరిక తీరుతూ ఇద్దరం కలసి మంచి ఎమోషన్ పంచడానికి అవకాశం దొరికింది.
I Manifested to act with this Hero Hero @ActorSatyaDev after seeing his performance - @tamannaahspeaks at #GurtundaSeetakalam Pre-release Event #GurtundaSeetakalamOnDec9th ????@nagshekar @akash_megha @SriVedaakshara @kaalabhairava7 @IAmKavyaShetty @priyadarshi_i @LakshmiBhupal pic.twitter.com/6pJO51UR2o
— Vamsi Kaka (@vamsikaka) December 6, 2022
హీరోల్లో పెద్ద హీరో, చిన్న చిన్న చిన్న హీరో అనే తేడాలు చూడను, ఎవరితోనైనా గాని నేను సినిమాను సినిమాగానే చూస్తాను. అయితే సినిమా కథ బాగుండాలి ఆ సినిమా ఆడియన్స్ కు నచ్చాలని కోరుకుంటాను. ఇందులో నేను స్టార్ హీరోయిన్ మిగతా వాళ్లు కొత్త వాళ్ళని ఎప్పుడూ అనుకోను. నా క్యారెక్టర్ వరకు నేను న్యాయం చేయాలని చూస్తాను. అయితే డైరెక్టర్ నాగ శేఖర్ గారు కూడా యాక్టర్ కావడంతో మాకు ఈజీ అయింది. ఇప్పటివరకు నేను యాక్టర్, డైరెక్టర్ అయిన వారితో సినిమాలు ఎప్పుడు చేయలేదు తను యాక్టర్ కావడంతో క్యారెక్టర్స్, ఎమోషన్స్ చాలా కరెక్ట్ గా అర్ధం చేసుకుని మాతో చేయించాడు. నేను ఇండస్ట్రీకి వచ్చి 17 ఇయర్స్ అయింది. ఇప్పటివరకు నాకు సినిమాపై ఉన్న క్రేజ్ తగ్గలేదు. ఫస్ట్ వచ్చినప్పుడు సినిమాపై నాకు ఎలాంటి ప్యాషన్ ఉందో ఇప్పుడు అదే ప్యాషన్ తో ఉన్నాను. ఓటిటిలు వచ్చిన తరువాత రీమేక్ సినిమాల ప్రభావం తగ్గినా మంచి సినిమా ఎప్పుడొచ్చినా చూడ్డానికి అడియన్స్ ఎప్పుడు రెడీగా ఉంటారు. ఇప్పుడు నేను కూడా ఓటిటి లకు వర్క్ చేస్తున్నాను యాక్టింగ్ పరంగా నాకు ఇంకొక ప్లాట్ ఫామ్ దొరికిందని ఫీలవుతున్నాను. గుర్తుందా గుర్తుందా శీతాకాలం సినిమాను గీతాంజలి సినిమాలో పోలుస్తున్నారు. అది నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక క్లాసిక్ సినిమాతో మా సినిమాను పోల్చినపుడు ఆ ఎక్స్పెక్టేషన్స్ ను మేము రీచ్ అవుతాము అనే నమ్మకంతో ఉన్నాము.
జనరల్ గా అందరి ఇళ్లలో అమ్మాయిలకుపెళ్లి గురించి ప్రెజర్ వున్నట్లే మా ఇంట్లో కూడా నన్ను ఎప్పట్నుంచో అడుగుతున్నారు,పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఇప్పుడే నేను ఏ డిసిజన్ తీసుకోలేదు. సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్, రూమర్స్ గురించి ఎక్కువగా ఆలోచించను, ఎందుకంటే అది వారి పార్ట్ ఆఫ్ లైఫ్, నటించడం అనేది మా లైఫ్. సోషల్ మీడియాలో వచ్చే మీమ్స్ ను అంత సీరియస్గా తీసుకొను. భాషతో సంబంధం లేకుండా మంచి కంటెంట్ ఉన్న ప్రతి కథకు న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాను. నా దగ్గరకు వచ్చే కథలను కూడా నేను సీనియారిటీని పక్కన పెట్టి నటిగా నటించడానికి ప్రయత్నిస్తాను. ఈ సంవత్సరం F3 తరువాత ఇప్పుడు "గుర్తుందా శీతా కాలం" రిలీజ్ అవుతుంది. దీని తరువాత చిరంజీవి తో "భోళాశంకర్ " ప్రాజెక్ట్ చేస్తున్నాను. అలాగే ఓటిటి లో మూడు ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. మలయాళంలో మొదటి సారిగా బాంద్రా సినిమా చేస్తున్నాను. ఈ సినిమతో మలయాళం ఇండస్ట్రీ కు పరుచయం అవుతున్నాను అని ముగించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gurthunda Seethakalam, Satya Dev, Tamannaah Bhatia, Tollywood news