TAMANNAAH BHATIA GOING TO ROMANCE WITH SUPER STAR MAHESH BABU IN SARILERU NEEKEVVARU MOVIE PK
మహేష్ బాబు కోసం తమన్నా.. సరిలేరు నీకెవ్వరులో ఐటం సాంగ్..
మహేష్ బాబు తమన్నా (Source: Twitter)
మహర్షి సినిమా తర్వాత మహేష్ బాబు ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరుతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతుంది. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది.
మహర్షి సినిమా తర్వాత మహేష్ బాబు ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరుతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతుంది. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. విడుదలకు సమయం కూడా దగ్గర పడుతుండటంతో బ్రేక్ లేకుండా షూట్ చేస్తున్నాడు అనిల్ రావిపూడి. దిల్ రాజు, అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహేష్ బాబుకు జోడీగా రష్మిక మందన్న ఇందులో నటిస్తుంది. ఇక ఈమెతో పాటు ఇప్పుడు మరో హీరోయిన్ కూడా సరిలేరు నీకెవ్వరులో జోడీ కడుతుంది. ఆమె మరెవరో కాదు తమన్నా భాటియా.
మహేష్ బాబు తమన్నా (Source: Twitter)
గతంలో ఆగడు సినిమాలో మహేష్‌తో కలిసి స్టెప్పులేసింది మిల్కీ బ్యూటీ. ఇక ఇప్పుడు ఐటం గాళ్‌గా మారబోతుందని తెలుస్తుంది. ఇందులో తమన్నా హీరో ఇంట్రడక్షన్ సాంగ్‌లో కాలు కదపబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. దీనికోసం ఆమెకు భారీ పారితోషికం ఆఫర్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇందులో మహేష్ బాబు ఆర్మీ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. ఇప్పటికే అల్లుడు శీను, స్పీడున్నోడు, జై లవకుశ, కెజియఫ్, జాగ్వర్ లాంటి సినిమాల్లో తమన్నా ఐటం సాంగ్స్ అదిరిపోయాయి.
మహేష్ బాబు తమన్నా (Source: Twitter)
ఇక ఇప్పుడు సరిలేరు నీకెవ్వరులో కూడా ఈమె జోడీ కట్టబోతుంది. ముందు శృతి హాసన్ కోసం ప్రయత్నించినా కూడా ఇప్పుడు తమన్నా వర్కవుట్ అయ్యేలా కనిపిస్తుంది. ఇందులో చాలా రోజుల తర్వాత కమెడియన్ బండ్ల గణేష్ కూడా రీ ఎంట్రీ ఇస్తున్నాడు. బండ్ల గణేష్ చివరి సారిగా 2012లో మహేష్ బాబు సినిమా బిజినెస్‌మేన్‌లో నటించాడు. మళ్లీ ఇప్పుడు మహేష్ సినిమాతోనే రీ ఎంట్రీ ఇస్తున్నాడు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.