సాయి పల్లవిని ఫాలో అవుతున్న తమన్నా.. ఎందుకంటే..?

Sai Pallavi: సాయి పల్లవి.. చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా తెలుగులో మంచి ఇమేజ్ సంపాదించుకున్న బ్యూటీ. ఫిదా సినిమాతో ఈమె క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఈ సినిమా తర్వాత వరస సినిమాలు చేస్తూ ఫ్యాన్ బేస్..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 19, 2020, 5:18 PM IST
సాయి పల్లవిని ఫాలో అవుతున్న తమన్నా.. ఎందుకంటే..?
తమన్నా సాయి పల్లవి (tamannaah sai pallavi)
  • Share this:
సాయి పల్లవి.. చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా తెలుగులో మంచి ఇమేజ్ సంపాదించుకున్న బ్యూటీ. ఫిదా సినిమాతో ఈమె క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఈ సినిమా తర్వాత వరస సినిమాలు చేస్తూ ఫ్యాన్ బేస్ కూడా క్రియేట్ చేసుకుంది సాయి పల్లవి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈమెను తమన్నా ఫాలో అవుతుండటం ఆసక్తికరంగా మారింది. తెలుగు ఇండస్ట్రీలో 15 ఇయర్స్ పండగ కూడా పూర్తి చేసుకుంది తమన్నా. అప్పట్నుంచి ఉన్న ఈమె ఇప్పటికీ వరస సినిమాలు చేస్తూ రప్ఫాడిస్తుంది. స్టార్ హీరోయిన్ అనిపించుకుంటుంది. చిరంజీవి లాంటి సూపర్ స్టార్స్‌కు ఇప్పుడు సరిజోడి అయిపోతుంది తమన్నా. సీనియారిటీ రావడంతో వాళ్లతోనే ఈమెకు అవకాశాలు కూడా వస్తున్నాయి.

తమన్నా సాయి పల్లవి (tamannaah sai pallavi)
తమన్నా సాయి పల్లవి (tamannaah sai pallavi)


అది కాకుండా చిన్నా పెద్ద తేడా లేకుండా అందరితోనూ సామాజిక న్యాయం చేస్తుంది తమన్నా. సందీప్ కిషన్ లాంటి చిన్న హీరోలతోనూ.. చిరంజీవి లాంటి పెద్ద హీరోలతోనూ అందరితోనూ రొమాన్స్ చేస్తుంది. ప్రస్తుతం ఈమె గోపీచంద్ హీరోగా నటిస్తున్న సీటీ మార్‌లో హీరోయిన్‌గా నటిస్తుంది. ఇందులో కబడ్డి కోచ్ పాత్రలో కనిపిస్తుంది తమన్నా. దానికోసం భారీగానే కష్టపడుతుంది కూడా. ఇది కాక ఈ పాత్ర పూర్తిగా తెలంగాణ నేపథ్యంలో ఉంటుంది. అందుకే ఈ సినిమాలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవాలని ఫిక్సైపోయింది ఈ బ్యూటీ.

తమన్నా Photo : Twitter
తమన్నా Photo : Twitter


అందుకే తెలంగాణ యాసను నేర్చుకుంటుంది తమన్నా. సంపత్ నంది కూడా ఈ విషయంలో తమన్నాకు హెల్ప్ చేస్తున్నాడు. ఈయన దర్శకత్వంలో తమన్నా నటిస్తున్న మూడో సినిమా ఇది. రచ్చ, బెంగాల్ టైగర్ తర్వాత వస్తున్న సినిమా ఇది. ఇక దానికితోడు తెలంగాణ యాస అంటే ఈ మధ్య కాలంలో సాయి పల్లవి పేరే ముందుగా గుర్తొస్తుంది. ఫిదాతో పాటు ఇప్పుడు నటిస్తున్న లవ్ స్టోరీ, విరాట పర్వం సినిమాల్లో కూడా తెలంగాణ యాసలోనే సాయి పల్లవి మాట్లాడబోతుందని ప్రచారం జరుగుతుంది. మొత్తానికి ఈ విషయంలో తమన్నా ఆమెను అయితే ఫాలో అయిపోతుంది.
Published by: Praveen Kumar Vadla
First published: March 19, 2020, 5:18 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading