తమన్నా ప్రస్తుతం గోపీచంద్ హీరోగా వస్తోన్న సీటీమార్ అనే చిత్రంలో నటిస్తోన్నసంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమానుల జరుగుతున్నాయి. ఈ సినిమా కబడ్డీ ఆట నేపథ్యంలో తెరకెక్కుతోంది. గోపీచంద్ ఏపీకి కోచ్‌గా ఉంటే.. తమన్నా తెలంగాణ కోచ్‌గా కనిపించనుందట. ఇక ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమానలు జరుపుకుంటున్నా ఈ సినిమాలో తమన్నా కూడా సొంతంగా డబ్బింగ్ చెప్పిందట. అంతేకాదు ఈ సినిమాలో తమన్నా తన పాత్రకు డబ్బింగ్ చెప్పడమే కాదు.. తెలంగాణ యాసలో అదరగొట్టిందట. దీనికి తమన్నా తన సోషల్ మీడియాలో ఓ ట్వీట్ కూడా చేసింది. తమన్నా.. రాస్తూ.. ''నాపై నమ్మకంతో జ్వాలారెడ్డిగా నటించే, డబ్బింగ్ చెప్పే అవకాశం ఇచ్చిన దర్శకుడు సంపత్ నందికి థాంక్యూ. తెలంగాణ యాస ప్రయత్నించడం అద్భుతమైన అనుభూతి'' అని పేర్కొంది. ఇక మరోవైపు సంపత్ నంది కూడా తమన్నాను పొగుడుతూ.. ''తెలుగులో డబ్బింగ్... అదీ తెలంగాణ యాసలో! తమన్నా విజయవంతంగా పూర్తిచేశారు'' అంటూ రాసుకొచ్చాడు. తమన్నా గతంలో 'ఊపిరి', 'సైరా' చిత్రాల్లోని పాత్రలకు డబ్బింగ్ చెప్పిన సంగతి తెలిసిందే. 'సీటీమార్' ఏప్రిల్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాను శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నాడు.
ఇక ఈ సినిమాతో పాటు తమన్నా నితిన్ అంధాదున్ తెలుగు రీమేక్‌లో నటించనుంది. హిందీలో టబు చేసిన పాత్రలో తమన్నా కనిపించనుంది. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నాడు. నితిన్ సరసన హీరోయిన్‌గా నభా నటేష్ చేస్తోంది. ఇక వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన‌్‌లో వచ్చిన బ్లాక్ బస్టర్ F2కు సీక్వెల్‌గా వస్తోన్న F3లో కూడా తమన్నా నటిస్తోంది. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండగా.. దిల్ రాజు నిర్మిస్తున్నాడు.
And that’s a wrap!!!
Dubbing in Telugu, moreover, Telangana accent..@tamannaahspeaks nails it and how!
తమన్నా ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. వెబ్ సిరీస్‌లు చేస్తుంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వస్తున్న 'లెవెంత్ అవర్' అనే వెబ్ సిరీస్ చేస్తుంది. ఈ వెబ్ సిరీస్ అల్లు అరవింద్ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. దీంతో తమన్నా యువ హీరో సత్యదేవ్‌తో కలిసి 'గుర్తుందా శీతాకాలం' సినిమాలో నటిస్తోంది. కన్నడ హిట్ మూవీ 'లవ్ మాక్‌టైల్'కు రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.