పాకిస్తాన్ క్రికెటర్‌తో తమన్నా ఎఫైర్.. అసలు నిజాలివే..

Tamannaah: ఇప్పటికే సానియా మీర్జా పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుని సంచలనం సృష్టించింది. ఇక ఇప్పుడు తమన్నా కూడా పాకిస్తాన్ క్రికెటర్‌‌తో డేటింగ్ చేస్తుందనే..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 4, 2020, 8:09 PM IST
పాకిస్తాన్ క్రికెటర్‌తో తమన్నా ఎఫైర్.. అసలు నిజాలివే..
తమన్నా (Tamannaah Bhatia/Instagram)
  • Share this:
ఇప్పటికే సానియా మీర్జా పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుని సంచలనం సృష్టించింది. ఇక ఇప్పుడు తమన్నా కూడా పాకిస్తాన్ క్రికెటర్‌‌తో డేటింగ్ చేస్తుందనే వార్తలు వస్తున్నాయి. కొన్ని రోజులుగా ఈ వార్తలు సోషల్ మీడియాలో బాగానే వినిపిస్తున్నాయి. ఒక్క ఫోటో చాలు కథలు అల్లేయడానికి.. ఇప్పుడు తమన్నా విషయంలో కూడా ఇదే జరిగింది. పాకిస్తాన్ క్రికెటర్ అబ్దుల్ రజాక్‌తో కలిసి ఈమె దిగిన ఫోటో వైరల్ అవుతుంది. ఫోటో వైరల్ అయితే పర్లేదు కానీ అతడితో తమన్నా డేటింగ్ చేస్తుంది.. ఎఫైర్ నడిపిస్తుందనే వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. అక్కడే వచ్చింది అసలు సమస్య.
పాకిస్తాన్ క్రికెటర్ అబ్దుల్ రజాక్‌తో తమన్నా భాటియా (tamannaah abdul razzaq)
పాకిస్తాన్ క్రికెటర్ అబ్దుల్ రజాక్‌తో తమన్నా భాటియా (tamannaah abdul razzaq)

పాక్ టీంకు దాదాపు 20 ఏళ్లు ఆడి ఈ మధ్యే రిటైర్ అయిన సీనియర్ క్రికెటర్ అబ్దుల్ రజాక్‌తో మన సీనియర్ హీరోయిన్ తమన్నాకు ఎఫైర్ ఉందని అప్పట్లో చాలా గాసిప్స్ వచ్చాయి.. అంతేకాదు ఇద్దరూ కలిసి మీడియా కంట కూడా పడ్డారు. దాంతో వాళ్లిద్దరి పెళ్లి కుదిరిందని.. బంగారం కొనివ్వడానికే షాపింగ్ చేసినట్టు ప్రచారం చేశారు. అయితే ఈ ఫోటోలు నిజమే కానీ అందులో ఊహ మాత్రం నిజం కాదు. అప్పుడెప్పుడో పాత ఫోటో ఇది. అప్పట్లో దుబాయ్ వెళ్లినపుడు అక్కడ బంగారం షాప్ ఓపెనింగ్‌కు తమన్నాతో పాటు రజాక్ కూడా వచ్చాడు.
పాకిస్తాన్ క్రికెటర్ అబ్దుల్ రజాక్‌తో తమన్నా భాటియా (tamannaah abdul razzaq)
పాకిస్తాన్ క్రికెటర్ అబ్దుల్ రజాక్‌తో తమన్నా భాటియా (tamannaah abdul razzaq)

దాంతో ఈ ఇద్దరూ కలిసి దిగిన ఫోటో ఇది. ఈ కార్యక్రమంలో వారిద్దరూ ప్రముఖ అతిథులుగా వచ్చారు. అంతే ఈ ఫొటోను బేస్ చేసుకొని తమన్నా కథలు పుట్టుకొచ్చాయి. పెళ్లైన పాకిస్తాన్ క్రికెటర్‌తో తమన్నా డేటింగ్ చేస్తుందని వార్తలు వచ్చాయి. తమన్నా మాత్రం ఈ పిచ్చి పుకార్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ముందు వెనక చూసుకోకుండా ఏది పడితే అది ఎలా రాస్తారు.. యిష్టమొచ్చినట్లు రాస్తే ఎవరూ ఊరుకోరు అంటూ రెచ్చిపోయింది.
పాకిస్తాన్ క్రికెటర్ అబ్దుల్ రజాక్‌తో తమన్నా భాటియా (tamannaah abdul razzaq)
పాకిస్తాన్ క్రికెటర్ అబ్దుల్ రజాక్‌తో తమన్నా భాటియా (tamannaah abdul razzaq)

తనకు ఎవరితోనూ సంబంధం లేదని స్పష్టం చేసింది మిల్కీ బ్యూటీ. రాబోయే రెండేళ్లలో తాను జీవితంలో సెటిల్ అవ్వాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు చెప్పింది తమన్నా. రెండేళ్ల వరకు పెళ్లి ఆలోచన లేదని.. ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్నట్లు చెప్పింది ఈమె. గోపీచంద్ హీరోగా సంపత్ నంది తెరకెక్కిస్తున్న సీటీమార్‌లో ఈమె నటిస్తుంది.
Published by: Praveen Kumar Vadla
First published: May 4, 2020, 8:09 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading