Tamannaah : త్వరలో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా.. గుడ్ న్యూస్ చెప్తానంటూ...

Tamannaah Bhatia | తెలుగు, హిందీ సినిమాలతో బిజీగా ఉన్న ఈ సుందరాంగి కోసం సరైన వరున్ని వెతికే పనిలో ఆమె తల్లి రజనీ భాటియా ఉన్నట్లు సమాచారం.

news18-telugu
Updated: August 7, 2019, 7:06 PM IST
Tamannaah : త్వరలో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా.. గుడ్ న్యూస్ చెప్తానంటూ...
తమన్నా భాటియా
news18-telugu
Updated: August 7, 2019, 7:06 PM IST
హీరోయిన్ తమన్నా భాటియా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోందా? ఆమె తల్లిదండ్రులు వరుడి కోసం వెతుకులాట ప్రారంభించారా? అంటే మిల్కీ బ్యూటీ చేసిన తాజా వ్యాఖ్యలు అవుననే సమాధానమిస్తున్నాయి. తెలుగు, హిందీ సినిమాలతో బిజీగా ఉన్న ఈ సుందరాంగి కోసం సరైన వరున్ని వెతికే పనిలో ఆమె తల్లి రజనీ భాటియా ఉన్నట్లు సమాచారం. వాస్తవానికి తమన్నా అమెరికాకు చెందిన ఓ డాక్టర్‌తో డేటింగ్ చేస్తోందని, ఈ ఏడాది పెళ్లి చేసుకోబోతోందని ఊహాగానాలు వినిపించాయి. వారి పెళ్లికి ఇరు కుటుంబాలు కూడా ఒప్పుకున్నాయని వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే, ఆ ఊహాగానాలకు తెరదించుతూ.. తాను ఎవ్వరితో డేటింగ్ చేయడం లేదని, తన తల్లిదండ్రులు చూసిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేసింది. ‘ఒక రోజు నటుడితో అంటారు. మరో రోజు క్రికెటర్‌తో అంటారు. ఇప్పుడు డాక్టర్‌తో అంటున్నారు. ఈ రూమర్లు విచారకరం. నా వ్యక్తిగత జీవితానికి వచ్చేసరికి రూమర్లను తట్టుకోలేను. తాను సింగిల్‌గానే ఉన్నా’ అని ప్రకటన కూడా ఇచ్చేసింది తమన్నా.

తాను పెళ్లి చేసుకుంటే.. కచ్చితంగా మీడియాకు, అభిమానులకు ముందే వెల్లడిస్తానని తమన్నా తెలిపింది. తనకు తగ్గ వ్యక్తిని వెతికి పెట్టాలని పూర్తి బాధ్యతను తన తల్లిదండ్రుల చేతిలోనే పెట్టానని, గతంలో గానీ, ఇప్పుడు గానీ తాను ఎవ్వరితో ప్రేమలో పడలేదని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా, తెలుగు, తమిళం, హిందీ సినిమాల్లో నటిస్తున్న తమన్నా.. తాను నటించిన పెట్రోమ్యాక్స్ సినిమా విడుదల కోసం ఆశగా ఎదురు చూస్తోంది. ఈ సినిమా తెలుగులో వచ్చిన ఆనందో బ్రహ్మ సినిమాకు రీమేక్.

First published: August 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...