మరోసారి మహేష్ బాబుతో పూజ హెగ్డే రొమాన్స్.. ‘సరిలేరు నీకెవ్వరు’లో..

మరోసారి సూపర్ స్టార్ మహేష్ బాబుతో పూజ హెగ్డే జతకట్టబోతోందని సమాచారం. మహర్షి సినిమాలో మహేష్ బాబుతో ఆడి పాడిన ఈ హాట్ బ్యూటీ.. సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

news18-telugu
Updated: October 2, 2019, 4:42 PM IST
మరోసారి మహేష్ బాబుతో పూజ హెగ్డే రొమాన్స్.. ‘సరిలేరు నీకెవ్వరు’లో..
మహేష్ బాబు, పూజ హెగ్డే
  • Share this:
ప్రస్తుతం టాలీవుడ్‌లో అగ్ర హీరోల సరసన వరుస ఆఫర్లతో టాప్ ప్లేస్‌లో ఉన్న ముద్దుగుమ్మ.. పూజ హెగ్డే. ఇటీవలే గద్దలకొండ గణేష్ సినిమాతో ప్రేక్షకుల ముందకు వచ్చిన ఈ బ్యూటీ అల్లు అర్జున్ సరసన అల వైకుంఠపురంలో, ప్రభాస్ సరసన మరో సినిమాలో నటిస్తోంది. సినీ ప్రేక్షకుల కోసం అందాలన్నీ ఆరబోసి.. అదిరిపోయే ట్రీట్ ఇచ్చేందుకు ఏ మాత్రం సంకోచించని ఈ బ్యూటీకి మరో భారీ ఆఫర్ దక్కించుకున్నట్లు సమాచారం. మరోసారి సూపర్ స్టార్ మహేష్ బాబుతో జతకట్టబోతోందని సమాచారం. మహర్షి సినిమాలో మహేష్ బాబుతో ఆడి పాడిన ఈ హాట్ బ్యూటీ.. సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. మహర్షి సినిమాలో వీరిద్దరి మధ్య రొమాన్స్ బాగా పండిందని గ్రహించి.. సరిలేరు నీకెవ్వరు దర్శకుడు అనిల్ రావిపూడి తన సినిమాలో.. ఆమెతో ఓ ప్రత్యేక గీతం చేయించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

ఇప్పటికే ఈ సినిమాలో ఓ ప్రత్యేక గీతంలో తమన్నా నటిస్తుండగా, మరో గీతంలో పూజ హెగ్డేను తీసుకోవాలని దర్శకుడు ప్లాన్ చేశాడట. అంటే.. రష్మిక మందన్నా, తమన్నా, పూజ హెగ్డే.. ముగ్గురు కథానాయికలతో సూపర్ స్టార్ స్టెప్పులేయనున్నాడన్నమాట. విజయశాంతి ముఖ్యపాత్ర పోషిస్తున్న ఈ సినిమాకు సంబంధించి మహేష్ బాబు పుట్టిన రోజున ఫస్ట్ లుక్ విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలని దర్శక నిర్మాతలు షూటింగ్‌ను వేగంగా పూర్తి చేస్తున్నారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: October 2, 2019, 4:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading