ఆ విషయంలో ఫిదా బ్యూటీని ఫాలో కానున్న హ్యాపీడేస్ భామ..

Tamannaah Bhatia : త‌మ‌న్నా ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 15 ఏళ్లైపోయింది. ఇన్నేళ్ల‌లో 50కి పైగా సినిమాల్లో న‌టించింది త‌మ‌న్నా.

news18-telugu
Updated: March 31, 2020, 2:24 PM IST
ఆ విషయంలో ఫిదా బ్యూటీని ఫాలో కానున్న హ్యాపీడేస్ భామ..
సాయి పల్లవి, తమన్నా Photo : Twitter
  • Share this:
Tamannaah Bhatia : త‌మ‌న్నా ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 15 ఏళ్లైపోయింది. ఇన్నేళ్ల‌లో 50కి పైగా సినిమాల్లో న‌టించింది త‌మ‌న్నా. తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ సినిమాల్లోనూ న‌టిస్తూ తన సత్తాను చాటుతోంది త‌మ‌న్నా. ఈ భామ ప్రస్తుతం గోపిచంద్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న 'సీటీమార్' చిత్రంలో హీరోయిన్‌గా చేస్తోంది. అయితే ఈసినిమా కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నానని అంటోంది అందాలభామ తమన్నా. 'ఇందులో తెలంగాణ మహిళా కబడ్డీ జట్టు కోచ్ జ్వాల పాత్రను చేస్తున్నాను. ఇందుకోసం తెలంగాణ యాస నేర్చుకున్నాను. అలాగే ఫిట్ గా కనిపించడం కోసం పూర్తి శాకాహారిగా మారాను' అని చెప్పింది. గతంలో సాయి పల్లవి కూడా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'ఫిదా'లో తెలంగాణ యాసలో అదరగొట్టిన సంగతి తెలిసిందే. మాస్‌ డైరెక్టర్‌ సంపత్‌ నంది దర్శకత్వంలో స్పోర్ట్స్ నేపథ్యంలో 'సీటీమార్' తెరకెక్కతోంది. ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై ప్రొడక్షన్‌‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో గోపీచంద్ ఫీమేల్‌ కబడ్డీ టీమ్‌కి కోచ్‌గా చేస్తుంటే.. తమన్నా తెలంగాణ ఫీమేల్‌ కబడ్డీ టీమ్‌ కోచ్‌‌లో పాత్రలో నటిస్తోంది. దీనికి సంబందించి ఇటీవలే ఫస్ట్‌లుక్ విడుదలైన సంగతి తెలిసిందే. ఆ ఫస్ట్ లుక్‌లో గోపిచంద్ మెడలో విజిల్‌తో కోచ్‌గా అదరగొట్టాడు. సీటీమార్ బలమైన యాక్షన్ సీక్వెన్స్ తో విజువల్స్‌తో ఈ సినిమా ఉండబోతుందట.

హై బడ్జెట్‌, అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతోన్న ఈ మూవీలో మిల్కీబ్యూటి తమన్నాతో పాటు మరో హీరోయిన్‌గా హిప్పీబ్యూటీ దిగంగన సూర్యవంశీ నటిస్తోంది. మరో కీలక పాత్రలో భూమిక నటిస్తోంది. గత చిత్రాలకు భిన్నంగా గోపి చంద్ మొదటిసారి స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నాడు. కాగా ఈ చిత్రంలో  లేడీ కబడ్డీ కోచ్ రోల్‌లో హీరోయిన్‌గా తమన్నా నటిస్తోంది. కాగా ఈ సినిమాలో ఆమెకు సంబందించిన లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఆ లుక్‌లో తమన్నా రెడ్ డ్రెస్‌లో కోపంగా చూస్తూ మెడలో హెడ్ ఫోన్స్‌తో అదరగొడుతోంది. ఈ చిత్రంలో తమన్నా జ్వాలా రెడ్డి అనే కబడ్డీ కోచ్‌గా నటిస్తోంది. 'సీటీమార్'‌కు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.
Published by: Suresh Rachamalla
First published: March 31, 2020, 2:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading