TAMANNA SIMHADRI WILL LIKELY TO DIRECTLEY ELIMINATED FROM BIGG BOSS TELUGU 3 FOR HER PROVOKING NATURE PK
Bigg Boss 3: ఈ వారం డైరెక్ట్ ఎలిమినేషన్ ఉండబోతుందా..?
‘బిగ్‌బాస్ 3 తెలుగు’ప్రతీకాత్మక చిత్రం
ఈ వారం డైరెక్ట్ ఎలిమినేషన్ ఉంటుందనే వార్తలు బయట బాగానే వినిపిస్తున్నాయి. పైగా ఇప్పుడు బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్న పరిస్థితులు చూస్తుంటే కూడా ఎవరు ఈ వారం ఎలిమినేట్ అవుతారనేది ఇట్టే అర్థం అయిపోతుంది.
ఏమో ఇప్పుడు ఇవే వార్తలే వినిపిస్తున్నాయి. ఈ వారం డైరెక్ట్ ఎలిమినేషన్ ఉంటుందనే వార్తలు బయట బాగానే వినిపిస్తున్నాయి. పైగా ఇప్పుడు బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్న పరిస్థితులు చూస్తుంటే కూడా ఎవరు ఈ వారం ఎలిమినేట్ అవుతారనేది ఇట్టే అర్థం అయిపోతుంది. రెండో వారం ఇంట్లోకి వచ్చిన తమన్నా సింహాద్రి.. వచ్చిన రెండు రోజుల తర్వాత నుంచి అసలు రూపం బయటికి చూపిస్తుందంటున్నారు ఆడియన్స్. ఈమె ప్రవర్తన ఫ్యాన్స్‌కు అసలు నచ్చడం లేదనే ప్రచారం జరుగుతుంది. దానికితోడు ఇంట్లో ఉన్న వాళ్లు కూడా ఆమెను త్వరగా బయటికి పంపాలంటూ బిగ్ బాస్‌కు అర్జీ పెట్టుకుంటున్నారు.
బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తున్న తమన్నా సింహాద్రి (Image:Screen Grab)
ఇవన్నీ చూస్తుంటే ఓటింగ్ కూడా తమన్నాకు వ్యతిరేకంగా వస్తుందని తెలుస్తుంది. పైగా ఆమె కూడా తనే ఈ వారం బయటికి వెళ్తానంటూ చెప్పుకుంటుంది. ఒవకళే ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ వారం మాత్రం కచ్చితంగా ఎలిమినేట్ అయ్యేది తమన్నా అని ఫిక్సైపోయారంతా. అది కాకుండా అంతగా పర్సనల్ అటాకింగ్ చేస్తుంది కాబట్టి బిగ్ బాస్ కూడా ఈమెపై కఠినమైన నిర్ణయం తీసుకోబోతున్నాడని తెలుస్తుంది. నామినేషన్స్ లేకుండా డైరెక్ట్ ఎలిమినేషన్ ప్రక్రియ కూడా జరుగుతుందనే వాదన జరుగుతుంది. నాగార్జున ఈ ఇష్యూపై ఎలా స్పందిస్తాడనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.