TAMANNA SIMHADRI IS MOSTLEY TO BE ELIMINATED FROM THIS WEEK BIGG BOSS TELUGU 3 PK
Bigg Boss 3: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరో తెలుసా..?
బిగ్ బాస్ లోగో
గొడవలు అనేది రెండు రకాలుంటాయి.. అనుకోకుండా పడటం.. కావాలనే పడటం.. మనం ఎందుకు పడుతున్నామో క్లారిటీ అనేది ఉండాలి. ఇప్పుడు బిగ్ బాస్ చూస్తున్న ప్రేక్షకులకు ఇదే అనుమానం వస్తుంది.
గొడవలు అనేది రెండు రకాలుంటాయి.. అనుకోకుండా పడటం.. కావాలనే పడటం.. మనం ఎందుకు పడుతున్నామో క్లారిటీ అనేది ఉండాలి. ఇప్పుడు బిగ్ బాస్ చూస్తున్న ప్రేక్షకులకు ఇదే అనుమానం వస్తుంది. అసలు తమన్నా అనే వ్యక్తి ఎందుకు బిగ్ బాస్ హౌజ్‌కు వచ్చింది.. వచ్చిన తర్వాత ఏం చేస్తుందనేది ఎవరికీ అర్థం కావడం లేదు. హేమ బయటికి వచ్చిన తర్వాత ఈమె ఇంట్లోకి వెళ్లింది. వచ్చిన రోజు నుంచి తానేంటో చూపిస్తుంది ఈమె. కావాలనే వివాదాలకు తెరతీస్తుందనేది ఇప్పుడు తమన్నా సింహాద్రి తీరు చూస్తుంటే అర్థమైపోతుంది.
బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తున్న తమన్నా సింహాద్రి (Image:Screen Grab)
అలీ రెజా కింగ్ అయినపుడు ఆయనతో కావాలనే ఆడుకుంది.. పర్సనల్ టార్గెట్ చేస్తూ రెచ్చగొట్టింది. ఇక ఇప్పుడు కూడా మరో కంటెస్టెంట్ రవికృష్ణపై కూడా ఇలాగే ఫైర్ అయింది. తనను నామినేట్ చేసాడని తెలిసి.. ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకుంది. మిగిలిన ఇంటి సభ్యులంతా ఆమెను ఫుల్లుగా టార్గెట్ చేసారు. అసలు ఆమె ఇంట్లో ఉండాల్సిన పర్సన్ కాదంటూ ఏకిపారేసారు.
తమన్నా సింహాద్రి ఫైల్ ఫోటో
దానికి కూడా తమన్నా సీరియస్ అయిపోయింది. అంతా కలిసి తనను కార్నర్ చేసారంటూ ఆమె రైజ్ అవ్వడం అక్కడ ఎవరికీ నచ్చలేదు. ఇదే నామినేషన్స్ రూపంలో చూపించారు హౌజ్ మేట్స్. ఈ వారం బయటికి వచ్చే లిస్టులో డేంజర్ జోన్లో ఉన్నది తమన్నానే అని తెలుస్తుంది. మొత్తానికి చూడాలిక.. ఈ బిగ్ బాస్ హౌజ్ రాను రాను ఎలా మారిపోనుందో..?
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.