కొన్ని మొహమాటాలు తప్పవు .. అందుకే ఆ పని చేశాను : తమన్నా

ప్రస్తుతం ఈ బ్యూటీకి సినిమాలు తగ్గాయి కాబ్టే..  ఐటెం సాంగ్స్ చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒక మీడియాకిచ్చిన ఇంటర్వ్యూ లో తనపై వస్తున్న విమర్శలకు జవాబిచ్చింది ఈ మిల్కీ బ్యూటీ. 

news18-telugu
Updated: January 22, 2020, 11:07 AM IST
కొన్ని మొహమాటాలు తప్పవు .. అందుకే ఆ పని చేశాను : తమన్నా
తమన్నా (Instagram/Photo)
  • Share this:
మిల్కీ బ్యూటీ తమన్నా దాదాపు పదిహేనేళ్లుగా తెలుగు, తమిళ ఇండస్ట్రీని  ఏలుతోంది. కేవలం హీరోయిన్ పాత్రలకే పరిమితం కాకుండా.. అవసరమైతే ఐటెం సాంగ్స్ చేయడానికి ఎలాంటి మెహమాటం చూపించదు. అయితే ప్రస్తుతం ఈ బ్యూటీకి సినిమాలు తగ్గాయి కాబ్టే..  ఐటెం సాంగ్స్ చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒక మీడియాకిచ్చిన ఇంటర్వ్యూ లో తనపై వస్తున్న విమర్శలకు జవాబిచ్చింది ఈ మిల్కీ బ్యూటీ. ఇటీవల విడుదలైన 'సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో మహేష్ బాబు సరసన ఒక పార్టీ సాంగ్ లో నటించింది ఈ బ్యూటీ. ఈ నేపథ్యంలో తమన్నా మాట్లాడుతూ .. నాకు సినిమాలు లేవు అని జరుగుతున్న ప్రచారం నూటికి నూరుపాళ్ళు అబద్ధమే అని చెప్పింది.  ప్రస్తుతం నేను వచ్చిన ప్రతి సినిమా ఒప్పుకోవడం లేదు. దాంతో ఏడాదిలో నా సినిమాలు తక్కువ సంఖ్యలో విడుదలవుతున్నాయి. ఈ కారణంగానే ప్రతి ఒక్కరూ నేను పనిలేకుండా ఇంట్లో ఖాళీగా కూర్చున్నానని అనుకుంటున్నారు.సినిమాలతో పాటు నా వ్యాపారం కూడా నాకు ఉంది. ఏమాత్రం ప్రాధాన్యం లేని సినిమాలు చేయవలసిన అవసరం లేదు అంటూ చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం ఈ బ్యూటీకి సినిమాలు తగ్గాయి కాబ్టే..  ఐటెం సాంగ్స్ చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒక మీడియాకిచ్చిన ఇంటర్వ్యూ లో తనపై వస్తున్న విమర్శలకు జవాబిచ్చింది ఈ మిల్కీ బ్యూటీ. 
‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో తమన్నా ఐటెం సాంగ్ (Twitter/Photo)


ఇక ఐటెం సాంగ్స్ పై మాట్లాడుతూ... నాకు సక్సెస్‌ లేని సమయంలో అనిల్‌ రావిపూడి ‘ఎఫ్‌2’తో నాకు మంచి సక్సెస్‌ ఇచ్చారు. దాంతో ఆయన అడగగానే ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో పార్టీ సాంగ్‌ చెయ్యడానికి ఒప్పుకున్నాను. కొన్ని మొహమాటాలు తప్పవు ఇండస్ట్రీలో అందుకే అలాంటి వచ్చినపుడు చేస్తున్నానంతే. అంతే తప్ప డబ్బుకోసం కాదు అంటూ క్లారిటీ ఇచ్చింది మిల్కీ బ్యూటీ. ఏదేమైనా ఆ సాంగ్స్‌తో నాకు మంచి పేరే వచ్చింది. ఆ విషయంలో నేను ఫుల్‌ హ్యాపీ అంటూ చెప్పుకొచ్చింది.

First published: January 22, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు