గ్లామర్‌కు ఓకే... కానీ ఆ విషయంలో మాత్రం కుదరదు : తమన్నా

 Tamannaah Bhatia : తమన్నా ఇప్పటి వరకు తెరపై సెక్సీగా అదరగొడుతూ.. గ్లామర్ ఆరబోయడం చూశాం కానీ.. తన పెదవులను ముద్దాడే అవకాశం ఏ హీరోకూ ఇవ్వలేదు.

news18-telugu
Updated: October 12, 2019, 10:51 AM IST
గ్లామర్‌కు ఓకే... కానీ ఆ విషయంలో మాత్రం కుదరదు : తమన్నా
Instagram/tamannaahspeaks
  • Share this:

 Tamannaah Bhatia : తమన్నా ఇప్పటి వరకు తెరపై సెక్సీగా అదరగొడుతూ.. గ్లామర్ ఆరబోయడం చూశాం కానీ.. తన పెదవులను ముద్దాడే అవకాశం ఏ హీరోకూ ఇవ్వలేదు. ముందు నుంచీ మిల్కీ బ్యూటీ ముద్దు సీన్లకు దూరంగా ఉంటూనే వస్తోంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ట్రెండ్ మారి.. ముద్దు సీన్లు అనేవి సర్వసాధారణం అయ్యాయి. అయినా.. తమన్నా మాత్రం తను పెట్టుకున్న కట్టుబాటు దాటి ముందుకు రావడం లేదు. ఈ మధ్య ఏ సినిమా ఇండస్ట్రీలో చూసిన లిప్ లాక్ సీన్లు కామన్ అయిపోయాయి.  హీరో, హీరోయిన్స్ మధ్య లిప్ లాక్ సీన్ లేకుంటే అబ్బే.. సినిమాలో అసలు రొమాంటిక్ యాంగిల్ లేదని పెదవి విరస్తున్నారు నేటితరం ప్రేక్షకులు. వాస్తవానికి ఒకప్పుడు ముద్దు సీన్లు అంటేనే హీరోయిన్లు ఆమడ దూరం వెళ్లేవారు.. మన తారలు. లిప్ లాక్ సీన్లు అంటే హాలీవుడ్ సినిమాల్లో మాత్రమే ఉంటాయి అనుకునే వారు.. కానీ ఆ సంస్కృతి మొదట హిందీ సినిమాలకు పాకింది. ఆ తర్వాత అన్ని సినిమా ఇండస్ట్రీలకు అంటుకొని.. అంతా కామన్ అయ్యింది. అందులో భాగంగా ఈ మధ్య వస్తున్న హీరోయిన్లు కూడా లిప్ లాక్ సీన్లను చాలా ఈజీగా తీసుకుంటున్నా రు.. ఒక్కో దశలో హీరో కన్నా వీరే ఇలాంటి సీన్స్‌ను అదరగొడుతున్నారు.


 

View this post on Instagram

 

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) on

అది అలా ఉంటే తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా లిప్ లాక్ లపై తాను తీసుకున్న నిర్ణయాన్ని చెప్పుకొచ్చిం ది. అందులో భాగంగా లిప్ లాక్ సన్నివేశాలలో నటించబోనని స్పష్టం చేసింది. కారణాలు ఏమైనా సినీపరిశ్రమలో అడుగు పెట్టినప్పుడే ముద్దు సన్నివేశాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలిపింది తమన్నా. ఆమె మాట్లాడుతూ.. నేను చాలా చిన్న వయసులోనే హీరోయిన్‌గా అరంగేట్రం చేశాను. నా తొలి సినిమా సమయానికి నా ఏజ్ 13. అప్పుడే ముద్దు సీన్లలోనూ, కాస్తా ఇంటిమేట్‌గా ఉండే సీన్లలోనూ నటించకూడదని నిర్ణయించుకున్నానని తెలిపింది. అంతేకాదు ఇప్పటికీ అదే నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని.. నా నిర్ణయాన్ని మార్చుకోవాలని నేనెప్పుడూ అనుకోలేదని తమన్నా చెప్పింది. అయితే గ్లామర్ విషయంలో ఎలాంటి హద్దులూ పెట్టుకోని తమన్నా.. తెరపై ముద్దు సీన్లకు మాత్రం కుదరదని అని చెప్పి అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చింది. 
View this post on Instagram
 

💅💇‍♀️. @pompyhans ❤️


A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) on
First published: October 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు