news18-telugu
Updated: October 5, 2020, 9:35 AM IST
రామ్ చరణ్, చిరంజీవి Photo : Twitter
Chiranjeevi Lucifer Remake | చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగ్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. త్వరలోనే ‘ఆచార్య’ సినిమాకు సంబంధించిన షూటింగ్లో చిరు పాల్గొనబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలోనే ఉండగానే చిరు మరో రెండు సినిమాలకు ఓకే చెప్పారు. అందులో మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘వేదాలం’ సినిమా ఒకటైటే.. మరోకటి ‘లూసిఫర్’. ఐతే.. ఆచార్య షూటింగ్ తర్వాత రెండు సినిమాలను ఒకేసారి ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నాడు చిరంజీవి. లూసీఫర్ రీమేక్ విషయానికొస్తే.. గతేడాది మలయాళంలో మోహన్‌లాల్, పృథ్వీ హీరోగా నటించిన ‘లూసీఫర్’ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నట్టు ప్రకటించారు చిరంజీవి. మోహన్ లాల్ నటించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ అక్కడ మంచి విజయం సాధించి ఆయన కెరీర్‌లోని ఓ చెప్పుకోదగ్గ చిత్రంగా నిలిచింది. తెలుగులో ఈ సినిమా డబ్ కూడా చేసారు. ఆ సంగతి పక్కనపెడితే.. ఈ సినిమాను చిరంజీవితో రీమేక్ చేయాలనే ఉద్దేశంతో మంచి రేటుకు ఈ రీమేక్ హక్కులను రామ్ చరణ్ సొంతం చేసుకున్నాడు.

చిరంజీవి లూసీఫర్ రీమేక్ (chiranjeevi lucifer)
ఇక అప్పటి నుంచి ఈ రీమేక్ దర్శకత్వ బాధ్యతలను ఎవరికి అప్పగించనున్నారనే విషయం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. కాగా ఆ సినిమా తెలుగు రీమేక్ దర్శకత్వ బాధ్యతలు సుజిత్‌కు అప్పగించారు చిరంజీవి. కానీ సుజిత్ స్క్రిప్ట్ చిరంజీవికి నచ్చకపోవడంతో ఇపుడా రీమేక్ బాధ్యతలను వినాయక్ చేతిలో పెట్టాడు. వినాయక్ కూడా ఆకుల శివతో కలిసి ఈ సినిమా స్క్రిప్ట్‌ను చిరంజీవి ఇమేజ్‌కు తగ్గట్టు రెడీ చేస్తున్నాడు. ఈ సినిమాలో చిరంజీవి సిస్టర్ పాత్రకు మంచి ఇంపార్టెంట్ ఉంది. అందుకే ఈ పాత్ర కోసం ముందుగా సుహాసిని అనుకున్నారు. ఆ తర్వాత ఇపుడు ఆ పాత్రను రమ్యకృష్ణతో చేయించనున్నట్టు సమాచారం. మరోవైపు ఈ సినిమాలో మరో హీరో పాత్ర కోసం విజయ్ దేవరకొండను సంప్రదించినట్టు సమాచారం. ముందుగా రామ్ చరణ్, అల్లు అర్జున్ పేర్లు పరిశీలనకు వచ్చినా.. ఫైనల్ గా ఈ పాత్రను విజయ్ దేవరకొండ చేయనున్నట్టు సమాచరాం. చిరుతో స్క్రిన్ షేర్ చేసుకోవడానికి విజయ్ దేవరకొండ ఇంట్రెస్ట్ చూపెడుతున్నాడు.మరోవైపు ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా మిల్కీ బ్యూటీ తమన్నాను అనుకుంటున్నారు.

చిరు సరసన మరోసారి తమన్నా (Twitter/Photo)
ఆల్రెడీ ఆచార్యలో చిరు సరసన కాజల్ మరోసారి నటిస్తోంది. ఇక మలయాళ రీమేక్ ‘లూసీఫర్’ సినిమలో హీరోయిన్ పాత్రకు అంతగా ప్రాధాన్యత లేదు. కానీ తెలుగులో ఈ పాత్రను బాగానే తీర్చిదిద్దినట్టు సమాచారం. ఈ సినిమాతో పాటు వేదాలం రీమేక్‌ను ఈ దసరాకు పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఒకవేళ వీలు కాకపోతే.. జనవరిలో ఈ సినిమాకు సంబంధించిన ముహూర్తం నిర్వహించనున్నట్టు సమాచారం. మొత్తంగా చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస సినిమాలతో అభిమానులను అలరించడానికి బాగానే కష్టపడుతున్నాడు.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
October 5, 2020, 9:35 AM IST