షూటింగ్ సెట్‌లో కిందపడి నటుడి మృతి..

గాడ్‌ఫ్రే గావ్ (File Photo)

షూటింగ్ సెట్‌లో కింద పడి నటుడి మృతి చెందాడు. ఈ ఘటన తైవాన్‌లో జరిగింది.

  • Share this:
    షూటింగ్ సెట్‌లో కింద పడి నటుడి మృతి చెందాడు. ఈ ఘటన తైవాన్‌లో జరిగింది. మోడల్ గాడ్ ఫ్రే గావో అనే నటుడు టీవీ షో షూటింగ్ జరుగుతుండగా ఆకస్మాత్తుగా కిందపడి మరణించాడు. 35 ఏళ్ల గాడ్ ఫ్రే గావో చైనాలో ప్రసారమయ్యే ఒక టీవీ షోలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నాడు. ఈ షో గురించి మాట్లాడుతుండగా అనుకోకుండా కిందపడిపోయాడు. వెంటనే అక్కడున్న వారు గాడ్ ఫ్రే గావోను ఆసుపత్రికి తరలించారు. అక్కడి డాక్టర్లు అతన్ని పరీక్షించి అప్పటికే హార్ట్ ఎటాక్‌తో మరణించాడాని చెప్పారు. ఇక చనిపోయిన గాడ్ ఫ్రే మృత దేహాన్ని తైవాన్‌కు తరలించారు. ఈ సందర్భంగా షో నిర్వాహకులు మాట్లాడుతూ.. ఈవెంట్‌లో గాడ్ ఫ్రే కింద పడిపోయి స్మృహ కోల్పోయాడని వెంటనే హాస్పటిల్‌కు తరలించినట్టు చెప్పుకొచ్చారు. ఈ లోపే ఆయన చనిపోయి ఉండవచ్చని తెలిపారు. కాగా గాడ్ ఫ్రే పలు పలు హాలీవుడ్ సినిమాల్లో ముఖ్యపాత్రలో నటించారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: