నా భర్త శృంగార సన్నివేశాల్లో నటిస్తే తట్టుకోలేకపోయేదాన్ని.. బాలీవుడ్ హీరో భార్య..

సినిమాల్లో శృంగార సన్నివేశాల్లో ఆయుష్మాన్ ఖురానాను చూడటం తనకు ఇబ్బంది కలిగించేది అని తెలిపారు. ఆయుష్మాన్ ఖురానాను అలా చూడటం తనను అభద్రతా భావానికి గురిచేసేది అని.. కానీ తర్వాత ఆ ఫీలింగ్‌ను అధిగమించానని చెప్పుకొచ్చారు.

news18-telugu
Updated: November 16, 2019, 8:38 PM IST
నా భర్త శృంగార సన్నివేశాల్లో నటిస్తే తట్టుకోలేకపోయేదాన్ని.. బాలీవుడ్ హీరో భార్య..
ఆయుష్మాన్ ఖురానా భార్య తహీరా కశ్యప్
  • Share this:
నటీనటులన్నాక.. సినిమాల్లో ఎలాంటి పాత్ర ఇచ్చినా పరకాయ ప్రవేశం చేయాల్సిందే. శృంగార సన్నివేశాలైనా సరే అందులో లీనం కావాల్సిందే. అయితే అలాంటి సన్నివేశాలను చూసేందుకు ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు గానీ సదరు నటీనటుల కుటుంబ సభ్యులకు మాత్రం అలాంటి సీన్లలో వారిని చూడటం కాస్త ఇబ్బంది కలిగించే అంశమే. బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా భార్య తహీరా కశ్యప్‌ కూడా తాజాగా ఇదే విషయాన్ని చెప్పారు. సినిమాల్లో శృంగార సన్నివేశాల్లో ఆయుష్మాన్ ఖురానాను చూడటం తనకు ఇబ్బంది కలిగించేది అని తెలిపారు. ఆయుష్మాన్ ఖురానాను అలా చూడటం తనను అభద్రతా భావానికి గురిచేసేది అని.. కానీ తర్వాత ఆ ఫీలింగ్‌ను అధిగమించానని చెప్పుకొచ్చారు. ఎంతలా అంటే.. సినిమాలో హీరో-హీరోయిన్ మధ్య ఏదైనా మిస్ అయితే.. ఇప్పుడు తానే సలహాలు ఇస్తున్నానని చెప్పారు.

మొదట్లో ఆయుష్మాన్‌ను అలాంటి సన్నివేశాల్లో చూడటానికి కాస్త ఇబ్బంది పడేదాన్ని. అభద్రతకు గురయ్యేదాన్ని. కానీ ఆయుష్మాన్ ఖురానా-రాధికా ఆప్టే అంధాదున్ సినిమా ఎడిటింగ్ చూస్తున్నప్పుడు.. హీరో-హీరోయిన్ల మధ్య ఏదో మిస్ అయిందని నేనే సలహాలు ఇవ్వడం మొదలుపెట్టాను.ఆ సమయంలో నేనెంత మార్పు చెందానో గ్రహించాను. ఒక అభద్రతా భావానికి గురయ్యే భార్య నుంచి సీన్లను అర్థం చేసుకునే స్థాయికి చేరుకున్నాను.
తహీరా కశ్యప్


First published: November 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు