హోమ్ /వార్తలు /సినిమా /

జబర్దస్త్‌ నుంచి ఆ రెండు టీమ్స్ ఔట్.. మరో రెండు టీమ్స్ ఇన్..

జబర్దస్త్‌ నుంచి ఆ రెండు టీమ్స్ ఔట్.. మరో రెండు టీమ్స్ ఇన్..

ఇప్పుడు మళ్లీ ఈమె గ్యాప్ ఇస్తుంది. ఇంద్రజను తీసుకొచ్చి కవర్ చేస్తున్నారు. ఇప్పటికే నాగబాబు షో నుంచి వెళ్లిపోయిన తర్వాత ఆర్నెళ్లకు పైగా కష్టపడితే మనో దొరికాడు. మళ్లీ ఇప్పుడు రోజా కానీ మానేసిందంటే మాత్రం మరో జడ్జి కోసం తల పట్టుకోవాల్సిందే.

ఇప్పుడు మళ్లీ ఈమె గ్యాప్ ఇస్తుంది. ఇంద్రజను తీసుకొచ్చి కవర్ చేస్తున్నారు. ఇప్పటికే నాగబాబు షో నుంచి వెళ్లిపోయిన తర్వాత ఆర్నెళ్లకు పైగా కష్టపడితే మనో దొరికాడు. మళ్లీ ఇప్పుడు రోజా కానీ మానేసిందంటే మాత్రం మరో జడ్జి కోసం తల పట్టుకోవాల్సిందే.

Jabardasth Comedy Show: ముందు నుంచి అంతా చెప్తున్నట్లుగానే జబర్దస్త్ కామెడీ షోలో చాలా మార్పులే చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా బాగా పర్ఫార్మ్ చేయని టీమ్స్‌ను నిర్ధాక్షణ్యంగా తొలగించారు మల్లెమాల యూనిట్.

ముందు నుంచి అంతా చెప్తున్నట్లుగానే జబర్దస్త్ కామెడీ షోలో చాలా మార్పులే చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా బాగా పర్ఫార్మ్ చేయని టీమ్స్‌ను నిర్ధాక్షణ్యంగా తొలగించారు మల్లెమాల యూనిట్. అసలే ఇప్పుడు రేటింగ్స్ విషయంలో చాలా వెనకబడిపోయింది జబర్దస్త్. పాత ఎపిసోడ్స్ ప్రసారం చేయడంతో రేటింగ్స్ విషయంలో రేసులో వెనకబడింది ఈ షో. ఇప్పుడు మూడు నెలల తర్వాత ఫ్రెష్ ఎపిసోడ్స్ వస్తున్నాయి. తాజాగా విడుదలైన ప్రోమోలు చూసిన తర్వాత అబ్బో చాలానే మార్చేసినట్లున్నారుగా మల్లెమాల వాళ్లు అంటున్నారు అభిమానులు కూడా.

ఎందుకంటే ఇంతకుముందు అంతగా పర్ఫార్మ్ చేయని ఫసక్ శశితో పాటు జీవన్ టీం కూడా కనిపించలేదు. ఆ రెండు టీమ్స్ మాత్రమే కాదు.. మరో రెండు టీమ్స్ కూడా జబర్దస్త్ నుంచి తొలగించేసారు. ఇదిలా ఉంటే కొత్త వాళ్లకు కూడా ఛాన్స్ ఇచ్చింది మల్లెమాల. పాత వాళ్లనే మళ్లీ తీసుకుని కొత్తగా అవకాశమిచ్చింది. ఒకప్పుడు జబర్దస్త్ కామెడీ షోతోనే కావాల్సినంత పాపులారిటీ తెచ్చుకున్న షకలక శంకర్ మళ్లీ వచ్చాడు. ఈయన మరోసారి నవ్వించడానికి రెడీ అయ్యాడు. ఆయనతో పాటు షేకింగ్ శేషు కూడా మరోసారి జబర్దస్త్ తెరపై కనిపించాడు. ఇక టాలీవుడ్ కమెడియన్ తాగుబోతు రమేష్ సైతం జబర్దస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.

సినిమాల్లో అవకాశాలు తగ్గిపోవడంతో ఈయన కూడా బుల్లితెర వైపు వచ్చేసాడు. ఈ మార్పులతో పాటు త్వరలోనే మరిన్ని మార్పులు కూడా కనిపించేలా ఉన్నాయి జబర్దస్త్‌లో. అసలే రేటింగ్స్ విషయంలో వెనకబడటంతో మరింత కఠినంగా ఉండాలని చూస్తుంది మల్లెమాల యూనిట్. అందుకే టీం లీడర్స్ కూడా ఒళ్లు దగ్గర పెట్టుకుని స్కిట్స్ చేస్తున్నారు. అయితే కరోనా వైరస్ కారణంగా మళ్లీ షూటింగ్స్ ఆగిపోతాయని ప్రచారం జరుగుతున్న వేళ.. ఏ క్షణాన ఏం జరుగుతుందో అని భయపడుతున్నారు కమెడియన్స్.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Jabardasth comedy show, Telugu Cinema, Tollywood