యువ హీరోతో సీనియర్ హీరోయిన్ రొమాన్స్.. పిక్ వైరల్

టబు.. వెంకటేష్ 'కూలీ నెం 1' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హైదరాబాదీ భామ.

news18-telugu
Updated: December 4, 2019, 11:32 AM IST
యువ హీరోతో సీనియర్ హీరోయిన్ రొమాన్స్.. పిక్ వైరల్
Instagram/ishaankhatter
  • Share this:
టబు.. వెంకటేష్ 'కూలీ నెం 1' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హైదరాబాదీ భామ. ఆ సినిమా హిట్ అవ్వడంతో తెలుగులో మంచి ఆఫర్స్ అందుకున్న టబు స్టార్ హీరోల సరసన నటించి అదరగొట్టింది. ఇటు తెలుగులో నటిస్తూనే అటు హిందీలో కూడ తన సత్తా చాటింది. తెలుగులో చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో నటిస్తూ.. అప్పట్లోనే భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకున్న నటిగా పేరు తెచ్చుకుంది. కొంత గ్యాపు తర్వాత రీసెంట్‌గా హిందీ సినిమా ‘అంధాధున్' రూపంలో భారీ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది టబు. ఈ సినిమా సక్సెస్ పుణ్యమా అని సెకండ్ ఇన్నింగ్స్‌ను జోరుగా సాగిస్తోన్న ఈ సీనియర్ నటి అన్ని భాషల్లో బిజీ అయిపోయింది. ఇప్పటికే పలు సినిమాల్లో నటిస్తోన్న టబు.. ప్రస్తుతం బాగా డిమాండ్ ఉన్న డిజిటల్ మీడియాలోకి కూడా ప్రవేశించేసింది. ఇందులో భాగంగా ఈ సీనియర్ హీరోయిన్ అడల్ట్ కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్‌లో నటిస్తోంది.'ఏ సూటబుల్ బాయ్' పేరుతో దీనిని తెరకెక్కిస్తున్నారు. దీనిలో సీనియర్ హీరోయిన్ టబు, యంగ్ హీరో ఇషాన్ కట్టర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. బోల్డ్ కాన్సెప్ట్‌లతో పలు సంచలనాత్మక చిత్రాలు రూపొందించిన దర్శకురాలు మీరా నాయర్ దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఆమె గతంలో  'కామసూత్ర', 'సలామ్ బాంబే', 'మాన్‌సూన్ వెడ్డింగ్' వంటి వైవిధ్యభరిత చిత్రాలను తెరకెక్కించారు.
 View this post on Instagram
 

A Suitable Boy.. first look


A post shared by Ishaan (@ishaankhatter) on

కాగా టబు ప్రస్తుతం తెలుగులో అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న 'అల వైకుంఠపురములో' నటిస్తోంది. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది.
మాయ చేస్తోన్న కీర్తి సురేష్..
First published: December 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading