Taapsee Pannu: తాప్సీని గెలికాడు...చీవాట్లు తిన్నాడు

ఢిల్లీని విడిచి ముంబై వెళ్లిపోయాక అక్కడ తాప్సీ ఓటు వేయడంపై ఓ నెటిజన్ అభ్యంతరం వ్యక్తంచేశాడు. దీనిపై స్పందించిన తాప్సీ..అతనికి దిమ్మదిరిగే సమాధానమిచ్చింది.

news18-telugu
Updated: February 8, 2020, 10:42 PM IST
Taapsee Pannu: తాప్సీని గెలికాడు...చీవాట్లు తిన్నాడు
తాప్సీ (ఫైల్ ఫోటో)
  • Share this:
అడిగిమరీ పెట్టించుకోవడం అంటే ఇదేనేమో..సోషల్ మీడియా వేదికగా తనను గెలికిన ఓ నెటిజన్‌కు చీవాట్లు పెట్టింది హీరోయిన తాప్సీ. ఇంతకీ ఏం జరిగిందంటే? ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తన కుటుంబ సమేతంగా వెళ్లి తాప్సీ  ఓటు హక్కును వినియోగించుకుంది. తన ఓటు హక్కును వినియోగించుకున్నానని, మీరు కూడా వినియోగించుకోవాలని ఓటర్లను కోరుతూ తన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీనిపై స్పందించిన ఓ నెటిజన్...ఓవర్ యాక్షన్ చేశాడు. ముంబైలో ఉంటున్న మీరు...ఢిల్లీని ఎవరు పాలించాలో నిర్ణయిస్తారా? అంటూ ప్రశ్నించాడు. ఢిల్లీ నుంచి ముంబైకి వెళ్లిపోయిన తాప్సీ...ఓటును కూడా ముంబైకి మార్చుకోవాలని ఉచిత సలహా ఇచ్చాడు.

సోషల్ మీడియాలో తనను ట్రోల్ చేసే వారిపై కఠినంగా వ్యవహరించే తాప్సీ...ఈ నెటిజన్ విషయంలోనూ తీవ్రంగానే స్పందించింది. ముంబైలో తాను ఎంత గడుపుతున్నానో...అంతకంటే ఎక్కువ లేదా అంతే ఢిల్లీలోనూ గడుపుతున్నట్లు స్పష్టంచేసింది. ఢిల్లీలోనే తన ఆదాయ పన్ను వసూలు చేస్తున్నట్లు తెలిపింది. ఢిల్లీ కోసం ఏమి చేయకుండా ఎందరో ఇక్కడ ఉంటున్నారు...తాను అలా కాదని చెప్పింది. తన పౌరసత్వం గురించి ప్రశ్నించవద్దు..ఢిల్లీకి మీరు ఏం చేశారో చూసుకుంటే మంచిదని చీవాట్లు పెట్టింది. అయితే తాను ఏం చేయాలో? ఏం చేయకూడదో? చెప్పడానికి నువ్వెవరంటూ మరో ట్వీట్‌లో చీవాట్లు పెట్టింది.



Published by: Janardhan V
First published: February 8, 2020, 10:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading