Bigg Boss: బిగ్‌బాస్ షోస్ పై విరుచుకుపడ్డ తాప్సీ..

హిందీతో పాటు తెలుగు ఇతర ప్రాంతీయ భాషల్లో ఎంతో సూపర్ సక్సెస్ సాధించిన బిగ్‌బాస్ షో పై సామాన్య జనాల్లో ఎంతో క్రేజ్ ఉంది. ఈ ప్రోగ్రామ్ పై తాజాగా తాప్సీ పన్ను చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.

news18-telugu
Updated: February 6, 2020, 8:55 AM IST
Bigg Boss: బిగ్‌బాస్ షోస్ పై విరుచుకుపడ్డ తాప్సీ..
బిగ్‌బాస్ పై తాప్సీ సంచలన వ్యాఖ్యలు (Twitter/Photo)
  • Share this:
హిందీతో పాటు తెలుగు ఇతర ప్రాంతీయ భాషల్లో ఎంతో సూపర్ సక్సెస్ సాధించిన బిగ్‌బాస్ షో పై సామాన్య జనాల్లో ఎంతో క్రేజ్ ఉంది. ఈ ప్రోగ్రామ్ పై తాజాగా తాప్సీ పన్ను చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. తాజాగా ఈమె ’తాప్పడ్’ మూవీ చేస్తోంది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆమె మీడియాతో మాట్లాడతూ.. బిగ్‌బాస్ షో పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇక బిగ్‌బాస్ షో విషయానికొస్తే.. ఎక్కడో విదేశాల్లో పాపులర్ అయిన బిగ్‌బాస్‌ షోను.. హిందీలో ముందుగా అర్షద్ వార్షీ  హోస్ట్ చేస్తూ భారతీయ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు.  ఆ తర్వాత ఈ రియాలిటీ షోను శిల్పాశెట్టి, అమితాబ్ బచ్చన్ తర్వాత సల్మాన్ ఖాన్ బిగ్‌బాస్ హోస్ట్‌గా ఎంట్రీ ఇచ్చాడు.  ఆతర్వాత మధ్యలో సంజయ్ దత్, ఫరా ఖాన్‌ కూడా ఈ షోను హోస్ట్ చేసారు. కానీ బిగ్‌బాస్ షోను ఎక్కువగా  సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తూ వచ్చాడు. అంతేకాదు ఈ ప్రోగ్రామ్ టీఆర్పీ పెంచడంలో సక్సెస్ అయ్యాడు. హిందీలో 12 సీజన్‌లు కంప్లీట్ చేసుకోని ప్రస్తుతం 13వ సీజన్ నడుస్తోంది. అక్కడ సూపర్ సక్సెస్ సాధించించిన బిగ్‌బాస్‌ను తమిళ, కన్నడ, మలయాళంతో పాటు తెలుగులో ఎన్టీఆర్ హోస్ట్‌గా ప్రారంభమైంది. తెలుగులో ఇప్పటికే మూడు సీజన్స్‌ను కంప్లీట్ చేసుకుంది.

Twitter


ఇక తాప్సీ తాజాగా ఈ బిగ్‌బాస్ షో పై మాట్లాడుతూ.. ఒకప్పుడు ఈ షో అంటే ఎంతో ఆసక్తికరంగా ఉండేది. కానీ రాను రాను ఈ షోలో హింస పెరిగిపోయిందన్నారు. ఈ ప్రోగ్రామ్‌ను ఫ్యామిలీ మొత్తం కలిసి చూసే విధంగా లేదని వాపోయింది. ప్రజలు కూడా ఇలాంటి హింసాత్మకంగా ఉన్న షోలనే ఎలా ఎంజాయ్ చేస్తున్నారని ఒకింత ఆశ్యర్యం వ్యక్తం చేసింది. అలాంటి టీవీలో జరిగితే ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. అదే తమకు జరిగితే ఇలా ఎంజాయ్ చేస్తారా అని మీడియను ఎదురు ప్రశ్నించింది. మొత్తానికి బిగ్‌బాస్ షో పై తాప్సీ చేసిన వ్యాఖ్యలు ఇపుడు బాలీవుడ్‌ను షేక్ చేస్తోంది.

First published: February 6, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు