వెండితెరపై మరో క్రికెటర్ బయోపిక్.. మిథాలీ రాజ్ పాత్రలో తాప్సీ..

గత కొన్నేళ్లుగా బాలీవుడ్‌లో బయోపిక్స్ సినిమాల హవా నడుస్తోంది. అందులో స్పోర్ట్స్ స్టార్స్ మీద తీసిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే రాబడుతున్నాయి. తాజాగా వెండితెరపై మహిళ ప్రపంచ క్రికెట్‌లో సత్తా చాటి మిథాలీ రాజ్ జీవిత చరిత్రను సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ నటి తాప్సీ మిథాలీ రాజ్ పాత్రలో నటిస్తోంది.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: January 29, 2020, 3:27 PM IST
వెండితెరపై మరో క్రికెటర్ బయోపిక్.. మిథాలీ రాజ్ పాత్రలో తాప్సీ..
తాప్సీ పన్ను (Twitter/Photo)
  • Share this:
గత కొన్నేళ్లుగా బాలీవుడ్‌లో బయోపిక్స్ సినిమాల హవా నడుస్తోంది. అందులో స్పోర్ట్స్ స్టార్స్ మీద తీసిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే రాబడుతున్నాయి. అందులో క్రికెటర్స్ మీద ‘అజారుద్దున్’, ‘ఎంఎస్ ధోని’, ‘సచిన్’ సినిమాలు తెరకెక్కాయి. ప్రస్తుతం బాలీవుడ్‌లో మన దేశానికి క్రికెట్‌లో తొలి వరల్డ్ కప్ అందించిన కపిల్ దేవ్ జీవిత చరిత్ర ఆధారంగా ..రణ్‌వీర్ సింగ్ హీరోగా ‘83’ బయోపిక్ తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా వెండితెరపై మహిళ ప్రపంచ క్రికెట్‌లో సత్తా చాటి మిథాలీ రాజ్ జీవిత చరిత్రను సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ నటి తాప్సీ మిథాలీ రాజ్ పాత్రలో నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌తో కూడిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేసారు. ఈ  చిత్రానికి ‘శభాష్ మిథు’ అనే టైటిల్ ఖరారు చేసారు.


మిథాలీ రాజ్ విషయానికొస్తే..  ఉమెన్ క్రికెట్‌‌లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా రికార్డులకు ఎక్కింది. ఇప్పటికీ ఇండియన్ టీంకు ఆడుతూనే ఉంది ఈమె. కొన్నేళ్లుగా మిథాలీ క్రికెట్‌కు ఎనలేని సేవలు అందిస్తూనే ఉంది. ఈ చిత్రాన్ని వచ్చే యేడాది ఫిబ్రవరి 2న విడుదల చేయనున్నారు. వయాకామ్ 18 సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని షారుఖ్‌ ఖాన్‌తో ‘రెయిస్’ చిత్రాన్ని తెరకెక్కించిన రాహుల్ డోలాకియా డైరెక్ట్ చేస్తున్నాడు.  మరి మిథాలీ బయోపిక్ ఎంతవరకు ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలిక.

First published: January 29, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు