news18-telugu
Updated: August 15, 2019, 8:51 PM IST
కంగన, తాప్సీ
బాలీవుడ్లో కంగనా రనౌత్ వర్సెస్ తాప్సీ యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. కంగనా సోదరి రంగోలి వీలు చిక్కినప్పుడుల్లా తాప్సీపై రెచ్చిపోతూనే ఉంది. దానికి తాప్సీ కూడా ఘాటుగానే సమాధానం చెబుతోంది. ఈ క్రమంలో కంగనాపై మరోసారి విరుచుకుపడింది తాప్సీ. మహిళా ప్రాధాన్యం ఉన్న మిషన్ మంగళ్ సినిమాకు ఎందుకు మద్దతు తెలపలేదని...సినిమాలో ఐదు మంది మహిళలున్నా ఎందుకు మెచ్చుకోలేదని ఓ ఇంటర్వ్యూలో గట్టిగా కంగనా రనౌత్‌కు కౌంటర్ ఇచ్చింది తాప్సీ.

ఒక మహిళకు మరో మహిళ అండగా ఉండాలని ఆమె (కంగనా) ఎప్పుడూ చెబుతుంటారు. కానీ నా సినిమాలను ఆమె ఎప్పుడూ మెచ్చుకోలేదు. మిషన్ మంగళ్ సినిమాలో ఐదుగురు మహిళలు ఉన్నారు. మరి మమ్మల్ని ఆమె మెచ్చుకుందా? ఆమె కంటే నేను జూనియర్ని. ఆమెకున్న ఫిల్మోగ్రఫీ నాకు లేదు. కానీ ఇతరులు మెచ్చుకోదగ్గ చిత్రాల్లో నేను నటించా. నన్ను 'చీప్', 'కాపీ' అని అంటున్నారు. నన్ను కంగనా కాపీ అంటే బాధపడను. సంతోషిస్తా. ఎందుకంటే ఆమె నా కన్నా గొప్ప నటి. నా కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే నటి కూడా.
— తాప్సీ
అసలు వీరిద్దరి మధ్య గొడవ ఎక్కడ మొదలైందంటే...గతంలో ఓసారి కంగనా రనౌత్‌ని ఉద్దేశిస్తూ అతివాదని తాప్సీ వ్యాఖ్యానించింది. దాని మనసులో పెట్టుకున్న కంగనా సోదరి రంగోలి.. తాప్సీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఆమె చాలా చీప్ (తక్కువ పారితోషికం తీసుకుంటుందనే ఉద్దేశంతో..) అని మండిపడింది. అంతేకాదు ఇతరులను చూసి కాపీ కొడుతుందని ఘాటుగా విమర్శించింది. అలా వీరి మధ్య మాటల యుద్ధం మొదలై నేటికీ కొనసాగుతోంది.
ఇటీవల ‘జడ్జ్‌మెంటల్ హై క్యా’ సినిమా ట్రైలర్ చూసిన తాప్సీ చాలా బాగుందని మెచ్చుకుంది. ఐతే ఎక్కడా కంగనా పేరును ప్రస్తావించలేదు. దాంతో మరోసారి సీన్లోకి ఎంటరైన రంగోలి...''కొందరు కంగనా రనౌత్‌ని కాపీకొడతారు. కానీ ప్రశంసించేందుకు మాత్రం మనసు రాదు'' అంటూ సెటైర్లు వేశారు. దీనిపై తాజాగా స్పందించిన తాప్సీ..కంగనా ఫ్యామిలీ గట్టిగా కౌంటర్ ఇచ్చింది. ఎప్పుడూ మహిళా సాధికాతర గురించి మాట్లాడే కంగనా రనౌత్.. మిషన్ మంగళ్ సినిమాను ఎందుకు మెచ్చుకోలేదని విమర్శించింది.
Published by:
Shiva Kumar Addula
First published:
August 15, 2019, 8:50 PM IST