news18-telugu
Updated: November 26, 2020, 9:21 AM IST
నటి తాప్సీ Photo : Twitter
Tapsee Pannu : తాప్సీ పన్ను దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు తెరకెక్కించిన ‘ఝుమ్మంది నాదం’ మూవీతో హీరోయిన్గా కెరీర్ ప్రారంభించింది. ఫస్ట్ మూవీలోనే తన గ్లామర్‌తో యూత్ తనవైపుకు తిప్పుకుంది. ఈ మూవీలో హీరో మనోజ్‌తో తాప్సీ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అదిరిపోయింది. ఆ తర్వాత తెలుగులో చాలా సినిమాలు చేసింది. అయితే ఏ సినిమా పెద్దగా గుర్తింపును తీసుకరాలేదు. అదీకాక.. తెలుగులో తాప్సీని చాలా వరకు గ్లామర్ పాత్రలకే పరిమితం చేశారు.. ఇక్కడి దర్శక నిర్మాతలు. హిందీలో మాత్రం మంచి సినిమాలు చేస్తూ నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్నీ ఎంచుకుంటూ అక్కడ అదరగొడుతోంది తాప్సీ. అందులో భాగంగా వచ్చినవే..'పింక్', 'ముల్క్','బద్లా' 'గేమ్ ఓవర్' సాండ్ కి ఆంఖ్ లాంటి సినిమాలు.. ఇలా వరుస హిట్ సినిమాలతో హిందీ పరిశ్రమలో దూసుకుపోతుంది తాప్సీ. అది అలా ఉంటే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే తాప్సీ.. ఇటీవల తన చిత్రాలను ఆమె అభిమానులతో షేర్ చేసుకోగా, ఓ నెటిజన్ ఆమె నటనపై విమర్శలు గుప్పించాడు. తాప్సీకి అసలు నటనే రాదని కామెంట్ పెట్టాడు. "నువ్వో ఫాల్తూ హీరోయిన్ వు అయినా నువ్వు సినిమాలు చేస్తుంటావు" అని కామెంట్ చేశాడు. ఇక ఆ కామెంట్‌కు తాప్సీ కిరాక్ రిప్లై ఇచ్చింది. నేను నా సినిమాల ద్వారా ఇక్కడి స్టాండర్డ్స్‌ను పెంచాను. నీకు మాత్రం ఈ విషయం అర్థం కావడం లేదు" అని తాప్సి కామెంట్ పెట్టింది. ఇక 2016లో 'పింక్' చిత్రంలో నటించిన తరువాత బాలీవుడ్ లో ఎన్నో అవకాశాలు అందిపుచ్చుకుంటున్న తాప్సీ వరుస విజయాలతో దూసుకెళ్తుంది.
ఇక అది అలా ఉంటే తాజాగా తాప్సీ ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ.. సినీ ఇండస్ట్రీలో తనకు జరిగిన అన్యాయాల గురించి ప్రస్తావించింది. ఆమె మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో హీరోల భార్యలు కూడా ప్రముఖ పాత్ర పోషిస్తారని.. తనకు జరిగిన ఓ విచిత్ర సంఘటన గురించి పేర్కోంది. హీరోగా తమ భర్త పక్కన అందంగా లేని తనలాంటి అమ్మాయి హీరోయిన్గా కనిపించడాన్ని సిగ్గుచేటుగా భావించేవారని చెప్పింది. దీంతో వారు తన స్థానంలో తమ భర్తల పక్కన ఇతర హీరోయిన్లకు అవకాశం ఇప్పించేవారని చెప్పుకొచ్చింది తాప్సీ. ఇదే కారణంతో కొందరు నిర్మాతలు కూడా తనను హీరోయిన్గా తీసుకోకపోయేవారని పేర్కోంది. ఇక తాప్సీ సినిమాల విషయానికి వస్తే ఆమె ప్రస్తుతం 'హసీన్ దిల్ రుబా ', 'శభాష్ మిథు' 'జనగణమన' (తమిళ ) మూవీస్ లో నటిస్తోంది.
Published by:
Suresh Rachamalla
First published:
November 26, 2020, 9:21 AM IST