రివ్యూ: ‘గేమ్ ఓవర్’.. అర్థం కాని సైకలాజికల్ థ్రిల్లర్..

మూడేళ్ల కింద మ‌యూరి సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యాడు అశ్విన్ శ‌ర‌వ‌ణ‌న్. ఆ సినిమాతోనే ఆక‌ట్టుకున్నాడు అశ్విన్. మ‌ళ్లీ ఇప్పుడు గేమ్ ఓవ‌ర్ అంటూ మ‌రో కొత్త ప్ర‌య‌త్నంతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు. ఈ సారి తాప్సీతో ఈ ప్ర‌యోగం చేసాడు అశ్విన్.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 14, 2019, 3:05 PM IST
రివ్యూ: ‘గేమ్ ఓవర్’.. అర్థం కాని సైకలాజికల్ థ్రిల్లర్..
గేమ్ ఓవర్ రివ్యూ
Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 14, 2019, 3:05 PM IST
రేటింగ్‌: 2.5/5
న‌టీన‌టులు: తాప్సీ, వినోదిని వైద్యనాధన్, అనీష్ కురువిల్ల, సంచన నటరాజన్, రమ్య సుబ్రహ్మణ్యం, పార్వతి తదితరులు
సంగీతం: రోన్ ఈథాన్ యోహాన్

నిర్మాత: ఎస్. శశికాంత్, చక్రవర్తి, రామచంద్ర
దర్శకత్వం: అశ్విన్ శరవణన్మూడేళ్ల కింద మ‌యూరి సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యాడు అశ్విన్ శ‌ర‌వ‌ణ‌న్. ఆ సినిమాతోనే ఆక‌ట్టుకున్నాడు అశ్విన్. మ‌ళ్లీ ఇప్పుడు గేమ్ ఓవ‌ర్ అంటూ మ‌రో కొత్త ప్ర‌య‌త్నంతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు. ఈ సారి తాప్సీతో ఈ ప్ర‌యోగం చేసాడు అశ్విన్.

క‌థ‌:
Loading...
స్వ‌ప్న‌(తాప్సీ) ఓ గేమ్ డిజైన‌ర్. ఎప్పుడూ ప‌నుల‌తోనే బిజీగా ఉంటుంది. అయితే ఓ డిసెంబ‌ర్ 31 రాత్రి బ‌య‌టికి వెళ్లి టాటూ వేయించుకున్న‌పుడు అనుకోని సంఘ‌ట‌న జ‌రుగుతుంది. అప్ప‌ట్నుంచి చీక‌టిని చూస్తే భ‌య‌ప‌డుతుంది స్వ‌ప్న‌. ఆమెకు ఎప్పుడూ వెంటే ఉండి సేవ‌లు చేస్తుంటుంది కళ‌మ్మ‌(వినోదిని). అదే స‌మ‌యంలో చ‌నిపోయిన ఓ అమ్మాయి అస్తిక‌ల‌ను టాటూ ఇంకులో క‌లిపి పొర‌పాటున స్వ‌ప్న చేయికి వేస్తారు. అక్క‌డ్నుంచి ఆమె జీవితంలో ఏవేవో జ‌రుగుతుంటాయి. అస‌లు ఆ అమ్మాయి ఎవ‌రు.. ఆమెను ఎవ‌రు చంపేస్తారు అనేది మిగిలిన క‌థ‌..

క‌థ‌నం:
సినిమా ఓపెన్ కాగానే అనుకోకుండా ఓ మ‌ర్డ‌ర్.. ఎవ‌రు చేసారో తెలియ‌దు. అక్క‌డ్నుంచి అస‌లు క‌థ మొద‌లు. ఆ త‌ర్వాత కూడా ఏం జ‌రుగుతుందో చాలా సేప‌టికి అర్థం కాదు. చీక‌టిని చూసే భ‌య‌పడే తాప్సీ.. ఎందుకు భ‌య‌ప‌డుతుందో.. ఫ్లాష్ బ్యాక్ ఏంటో ఎవ‌రికీ తెలియ‌దు. ఇలా గేమ్ ఓవ‌ర్ మొద‌ట్లోనే చాలా అనుమానాలు తెప్పిస్తుంది. ఓ ప‌ట్టాన అర్థం కాని హాలీవుడ్ స్క్రీన్ ప్లేతో ముందుకు సాగే సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ ఈ చిత్రం. అస‌లు మ‌ర్డ‌ర్స్ ఎందుకు జ‌రుగుతున్నాయి.. ఎవ‌రు చంపేస్తున్నారు.. ఎందుకు అమ్మాయిల త‌ల‌లు న‌రుకుతున్నారు అనేది క్లారిటీ ఉండ‌దు. కానీ తాప్సీ మాత్రం త‌న పాత్ర‌లో 100 శాతం న్యాయం చేసింది. ద‌ర్శ‌కుడు త‌న‌ను న‌మ్మి ఏ క‌థ‌ను అయితే చెప్పాడో అందులో దూరిపోయింది. ఫ‌స్టాఫ్ అంతా ఏమీ అర్థం కాదు.
ఏ సీన్ ఎందుకు వ‌స్తుందో కూడా క్లారిటీ ఉండ‌దు. సెకండాఫ్‌లో ఒక్కో ముడి విప్పుతూ వ‌చ్చాడు ద‌ర్శ‌కుడు. అప్ప‌టికీ చాలా ప్ర‌శ్న‌లు అలాగే మిగిలిపోయాయి. ఒంట‌రిగా ఉండే అమ్మాయిల‌ను చంపే ముగ్గురు సైకోలు.. ఓ అమ్మాయిని చంపేస్తారు. ఆమె అస్తిక‌ల‌ను తాప్సీ టాటూకు వాడ‌తారు. ఆమె చ‌నిపోయే వ‌ర‌కు పోరాడింది కాబ‌ట్టి చ‌నిపోయే ముందు వ‌ర‌కు కూడా పోరాడ‌ట‌మే జీవితం అనే సందేశాన్ని ఈ క‌థ‌లో చూపించాడు ద‌ర్శ‌కుడు. బి, సీ సెంట‌ర్ల‌లో ఈ సినిమాను అర్థం చేసుకోవ‌డం క‌ష్ట‌మే కానీ మ‌ల్టీప్లెక్స్ ఆడియ‌న్స్‌కు.. భిన్న‌మైన సినిమాల‌ను ఇష్ట‌ప‌డే వారికి గేమ్ ఓవ‌ర్ న‌చ్చే అవ‌కాశం ఉంది.

న‌టీన‌టులు:
తాప్సీ ప‌న్ను చాలా బాగా న‌టించింది. తొలిసారి పూర్తిస్థాయి ఛాలెంజింగ్ రోల్ చేసింది. త‌న పాత్ర‌కు వంద శాతం న్యాయం చేసింది ఈ భామ‌. ఇక ఆమె ప‌నిమనిషి పాత్ర‌లో వినోదిని అద్భుతంగా న‌టించింది. చిన్న పాత్ర‌లో అయినా కూడా డాక్ట‌ర్ పాత్ర‌లో అనీష్ కురివిల్ల కూడా బాగున్నాడు. ఇక సంచ‌న న‌ట‌రాజ‌న్, ర‌మ్య సుబ్ర‌మ‌ణ్యం కూడా సంద‌ర్భానుసారంగా బాగానే న‌టించారు.

టెక్నిక‌ల్ టీం:
ఇలాంటి సైకో థ్రిల్ల‌ర్ సినిమాల‌కు సంగీతం కీల‌కం. రోన్ ఈథాన్ యోహాన్ ఈ విష‌యంలో చాలా మంచి ఔట్ పుట్ ఇచ్చాడు. ఎడిటింగ్ కూడా బాగానే ఉన్నా.. ఫ‌స్టాఫ్ చాలా వ‌ర‌కు బోర్ కొట్టించాడు. అర్థం కాని స‌న్నివేశాల‌తో ముందుకు వెన‌క్కి వెళ్లింది ఈ చిత్రం. సెకండాఫ్ మాత్రం ప‌ర్లేదు. స్క్రీన్ ప్లే ప‌రంగా మ‌రోసారి మాయ చేసాడు అశ్విన్. అయితే సాధార‌ణ ప్రేక్ష‌కుల‌కు అది ఎంత‌వ‌ర‌కు అర్థం అవుతుంద‌నేది ప్ర‌శ్నార్థ‌క‌మే. మాయ సినిమా మాదిరే ఇది కూడా ఇంట‌లెక్చువ‌ల్ క‌థ‌.

చివ‌ర‌గా ఒక్క‌మాట‌:
గేమ్ ఓవ‌ర్.. అక్క‌డ‌క్క‌డా గేమ్ ఆన్.. మిగిలిన చోట్ల గేమ్ ఓవ‌ర్..
First published: June 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...